ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలో మహిళలకు మూడు నెలల ఉచిత బ్యూటీషియన్ శిక్షణ
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి:రామగుండం ఎన్‌టీపీసీ, ఎన్‌టీపీసీ రామగుండం సంస్థ సామాజిక బాధ్యత విభాగం, దీప్తి మహిళా సమితి సంయుక్త ఆధ్వర్యంలో సమీప గ్రామాలకు చెందిన మహిళల కోసం మూడు నెలల ఉచిత బ్యూటీషియన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
సాయి సేవా సమితి సమీపంలోని వృత్తి శిక్షణ కేంద్రంలో ఈ శిక్షణ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బ్యూటీషియన్ రంగంలో నైపుణ్యాలు పెంపొందించుకుని స్వయం ఉపాధి లేదా ఉద్యోగ అవకాశాలు పొందాలనుకునే మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ శిక్షణకు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు అర్హులు. శిక్షణ కాలం మూడు నెలలు కాగా, సీట్లు పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ఆసక్తి గల మహిళలు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి శ్రీమతి అర్చనను 6281046137 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
పేర్ల నమోదు చివరి తేదీ: 15 జూలై 2026
సమీప గ్రామాలకు చెందిన మహిళలు సీట్లు పరిమితంగా ఉన్నందున ఆలస్యం చేయకుండా వెంటనే నమోదు చేసుకోవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
