పీకే రామయ్య కాలనీ డ్రైనేజీ పనులు త్వరలో పూర్తి చేస్తాం, మేయర్ మహంకాళి స్వామి….
హామీ ఇచ్చిన మేయర్‌కు కృతజ్ఞతలు తెలిపిన తొలి డివిజన్ కార్పొరేటర్ మడిపెల్లి విజయ-మల్లేష్
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి:రామగుండం,
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తొలి డివిజన్ పీకే రామయ్య కాలనీలో అసంపూర్తిగా నిలిచిపోయిన ఓపెన్ డ్రైనేజీ నిర్మాణ పనులను త్వరలోనే పునఃప్రారంభించి పూర్తి చేస్తామని నగర మేయర్ మహంకాళి స్వామి హామీ ఇచ్చారు.
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మిగిలిన డ్రైనేజీ పనులను వెంటనే చేపట్టాలని కోరుతూ తొలి డివిజన్ కార్పొరేటర్ మడిపెల్లి విజయ- మల్లేష్ మేయర్ మహంకాళి స్వామికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మడిపెల్లి విజయ మల్లేష్ మాట్లాడుతూ, గతంలో రూ.25 లక్షల వ్యయంతో పీకే రామయ్య కాలనీ ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఓపెన్ డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభించినప్పటికీ, బడ్జెట్ కొరత కారణంగా అప్పటి కాంట్రాక్టర్ పనులను మధ్యలోనే నిలిపివేశారని తెలిపారు.
ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాల్సిన అవసరం ఉందని మేయర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
ఈ సమస్యపై సానుకూలంగా స్పందించిన మేయర్ మహంకాళి స్వామి, మిగిలి ఉన్న డ్రైనేజీ నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభించి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
ఈ సందర్భంగా తొలి డివిజన్ ప్రజల తరఫున స్పందించి హామీ ఇచ్చిన మేయర్ మహంకాళి స్వామికి కార్పొరేటర్ మడిపెల్లి విజయ- మల్లేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
