SAKSHITHA NEWS
Kuwait fire.. Among the dead, three are residents of AP

కువైట్ అగ్నిప్రమాదం.. మృతుల్లో ముగ్గురు ఏపీ వాసులు

కువైట్‌లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం

మృతి చెందిన 49 మంది 45 మంది భారతీయులే. అత్యధికంగా 24 మంది కేరళ కార్మికులు

శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన ముగ్గురి సజీవ దహనం

కువైట్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మరణించిన 49 మందిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు ఉన్నట్టు తాజాగా బయటపడింది.

ప్రాణాలు కోల్పోయిన 49 మందిలో 45 మంది భారతీయులే కాగా, వీరిలో అత్యధికంగా 24 మంది కేరళవారు ఉన్నారు. ఏడుగురు తమిళనాడు కార్మికులు.

మరణించిన తెలుగువారు వీరే
కువైట్ అగ్నిప్రమాదంలో మరణించిన వారిలో ముగ్గురు తెలుగు వారు ఉన్నట్టు ప్రకటించిన ఏపీ నాన్‌రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్‌టీ) వారి వివరాలను వెల్లడించింది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకిభద్రకు చెందిన తామాడ లోకనాథం (31), తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లికి చెందిన సత్యనారాయణ, అన్నవరప్పాడుకు చెందిన మీసాల ఈశ్వరుడు ఉన్నట్టు తెలిపింది. నేటి మధ్యాహ్నం నాటికి వీరి మృతదేహాలు ఢిల్లీకి చేరుకుంటాయని, అక్కడి నుంచి వారి స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేసినట్టు వివరించింది.