SAKSHITHA NEWS

పవన్ కళ్యాణ్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్?

అమరావతి:
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను చంపేస్తానంటూ బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతోంది. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ పర్సనల్ పిఆర్ఓ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేషీకీ బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలుస్తోంది. ఆయనను చంపేస్తామని హెచ్చరిస్తూ ఆగంతకుడి నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి అభ్యంతరకరమైన భాషతో హెచ్చరిస్తూ సదరు అగంతకుడు మెసేజ్ లు సైతం పంపించినట్లు తెలుస్తోంది.వెంటనే ఈ బెదిరింపు కాల్స్ అలాగే బెదిరింపు మెసేజ్ విష యాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి పేషీ సిబ్బంది తీసుకు వచ్చినట్లు చెబుతున్నారు.

వెంటనే పేషీ అధికారులు ఈ బెదిరింపు కాల్స్ అలాగే అభ్యంతరకరమైన భాషతో కూడిన మెసేజ్ల విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకు వెళ్లినట్లుగా చెబుతున్నారు.

ప్రస్తుతానికి ఒకపక్క రాజకీయాలు చేస్తూనే మరోపక్క సినిమాల విషయంలో కూడా పవన్ కళ్యాణ్ బిజీ అవుతున్నా రు. ప్రస్తుతం ఆయన హరి హర వీరమల్లు సినిమాను మళ్ళీ పట్టాలు ఎక్కించారు.


SAKSHITHA NEWS