SAKSHITHA NEWS

భారీ వర్షాలకు సర్వం కోల్పోయిన వారు ధైర్యంగా ఉండాలి
జమాఅతె ఇస్లామి హింద్

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

జమాఅతె ఇస్లామి హింద్ ఖమ్మం శాఖ ఆధ్వర్యంలో ఇటీవల భారీ వర్షాలకు సర్వం కోల్పోయిన రామన్నపేట కాలనీ మరియు వెంకటేశ్వర కాలనీ వరద బాధితుల ఇండ్ల దగ్గరికి వెళ్లి వంట చేయటానికి కావలిసిన వంట పాత్రలు , కడాయి, ప్లేట్ లు, గ్లాస్ లు, స్టీల్ గిన్నెలు, గంటలు తదితర సామాన్లతో కూడిన కిట్టుగా తయారుచేసి వరద ముంపు బాధిత కుటుంబాలకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జమాఅతె ఇస్లామి హింద్ జిల్లా అధ్యక్షులు జైనుల్ పాషా మాట్లాడుతూ ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరమని మనం ఎంత సహాయం చేసినా తక్కువే అని అన్నారు . సామాజిక సేవకు ప్రాధాన్యత ఇచ్చే సంస్థ జమాఅతె ఇస్లామి హింద్ అందుకే ఆపదలో ఉన్న వారికి చేయూత అందించేందుకు తమ సంస్థ ఎప్పుడు ముందుంటుందని అన్నారు. ఈ కార్యాక్రమములో ఖిల్లా అధ్యక్షులు అబ్దుల్ మలిక్, , ఇంద్ర నగర్ అధ్యక్షులు అబ్రార్ అలీ, ఉపాధ్యక్షులు యసుఫ్ షరీఫ్, మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS