SAKSHITHA NEWS

నేతల స్టేచర్ గురించి కాదు.. ప్రజల ఫ్యూచర్ గురించి ఆలోచించండి: బండి సంజయ్

రైతులను రేవంత్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న బండి సంజయ్

అన్నదాతలను ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచన

ప్రభుత్వ నిర్లక్ష్యానికి రైతులు ఎందుకు మూల్యం చెల్లించాలని ప్రశ్న

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. రైతు భరోసా ఇవ్వడం లేదని, రుణమాఫీ పూర్తి చేయరని, పంట నష్ట పరిహారం ఇవ్వరని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ మార్క్ రైతు సంక్షేమ రాజ్యమంటే ఇదేనా? అని ప్రశ్నించారు. రాజకీయ నాయకుల స్టేచర్ గురించి కాకుండా… రైతుల ఫ్యూచర్ గురించి ఆలోచించాలని అన్నారు.

అసెంబ్లీలో రైతు సమస్యలపై చర్చించాలని బండి సంజయ్ సూచించారు. కష్టాల్లో ఉన్న అన్నదాతలను ఆదుకోవాలని… యాసంగి పూర్తయ్యేంత వరకు నీళ్లు వదలాలని కోరారు. కాలువల్లో నీళ్లున్నా ఎందుకు వదలడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి రైతులు ఎందుకు మూల్యం చెల్లించాలని ప్రశ్నించారు.

10 లక్షల ఎకరాల్లో పంటలు ఎండుతున్నా ప్రభుత్వానికి అన్నదాతల ఆక్రందనలు వినిపించడం లేదని సంజయ్ మండిపడ్డారు. ప్రతి విషయాన్ని కేంద్ర ప్రభుత్వంపై నెట్టేసి రేవంత్ ప్రభుత్వం తప్పించుకోవాలనుకుంటోందని విమర్శించారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని అన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app