సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా దొంగల హల్చల్
రాత్రి,పగలు తేడా లేకుండా దొంగతనాలకు పాల్పడుతున్న దుండగులు
…………………………….
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : సూర్యాపేట జిల్లాలో రాత్రనక, పగలనక దొంగతనాలు జరుగుతుండడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. వారం రోజుల వ్యవధిలో వరుసగా రెండు ప్రాంతాల్లో దొంగతనాలు జరిగాయి.
సూర్యాపేట మున్సిపాలిటీ 1వ వార్డులోని పీ.ఎన్.ఆర్ టౌన్ షిప్ లో రాత్రిళ్లు గోడకు కన్నం వేసి దొంగతనానికి పాల్పడ్డ ఘటన మరవక ముందే శనివారం పట్టణ నడిబొడ్డున ఓ దొంగ పట్టపగలే వృద్ధురాలు మెడలో నుంచి బంగారు గొలుసును దొంగిలించాడు. దీన్ని గమనించిన యువకులు అతన్ని వెంబడించి పట్టుకొని దేహశుద్ధి చేసి గొలుసు వృద్ధురాలికి ఇప్పించారు. ఇదే విషయమై….
వృద్ధురాలు చంద్రకళను దొంగతనం ఎలా జరిగిందని ప్రశ్నించగా విద్యనగర్ నుంచి 60 ఫీట్ల రోడ్డు మీదుగా డీమార్ట్ కు వెళ్తుండగా, అతను కొంత దూరం తన వెంటే వచ్చాడని, నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో దొంగ తన మెడలో నుంచి గొలుసును దొంగిలించి పారిపోతుండగా తాను కేకలు వేయడంతో కొంతమంది యువకులు వచ్చి అతన్ని పట్టుకున్నారని తెలిపింది. స్థానిక యువకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగను స్టేషన్ తరలించారు.