గ్యాస్ కొరత లేదు ప్రజలు ఇబ్బందులు పడ వద్దు..
…
సాక్షిత:
కేంద్రం లో ఉన్న బీజేపీ ప్రభుత్వం గ్యాస్ కొరత రానివ్వదు
పెట్రోల్, డీజిల్ కొరత కూడా లేదు
వ్యాపారుల పుకార్లు నమ్మ వద్దు
కోదాడ లో గ్యాస్ గోడౌన్ సందర్శించిన బీజేపీ సూర్యా పేట జిల్లా ఉపాధ్యక్షుడు మల్లే బోయిన వెంకటేష్ బాబు.
కోదాడ నియోజకవర్గంలో ఎటువంటి గ్యాస్, పెట్రోల్, డీజిల్ ఇంధనాల కొరత లేదని బీజేపీ సూర్యా పేట జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెబోయిన వెంకటేష్ బాబు అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణం లోని గ్యాస్ ఏజెన్సీ గోదాము వద్ద పంపిణీతీరును బిజెపి సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు మల్లెబోయిన వెంకటేష్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గ్యాస్ కొరత లేకుండా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చూస్తుందన్నారు. గ్యాస్ లోడ్ లు వస్తున్నాయా లేవా అని అడిగి తెలుసుకున్నారు.ప్రతి రోజు గ్యాస్ లోడ్ వస్తుందన్నారు. గ్యాస్ బుక్ చేసుకున్న 15 రోజులకు సిలిండర్ అందుతుందన్నారు.కొందరు బ్లాక్ మార్కెట్ కోసం కృత్రిమ కొరత సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. పెట్రోల్ డీజిల్ కొరత లేదని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ప్రజలు నమ్మ వద్దన్నారు. ప్రజలకు బీజేపీ పార్టీ అండగా ఉంటుందన్నారు. గ్యాస్, డీజిల్,పెట్రోల్ సరఫరా పై బీజేపీ రాష్ట్ర నాయకత్వం కేంద్రంతో నిత్యం సంప్ర దిస్తుందన్నారు.గ్యాస్ అధిక ధరకు విక్రయించిన, కృత్రిమ కొరత సృష్టించేందుకు ప్రయత్నించిన బీజేపీ పక్షాన అడ్డుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్య కర్తలు ఉన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY