SAKSHITHA NEWS

GOD భగవంతుని సేవకు మించిన భాగ్యం మరొకటిలేదు

రామకోటి రామరాజు సేవలు అమోఘం

— కృష్ణాలయ అధ్యక్షులు యెలగందుల రాంచెంద్రం

సాక్షిత సిద్దిపేట జిల్లా :

సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ రామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు భద్రాచల దేవస్థాన ముత్యాల తలంబ్రాలు, స్వామి శేషవస్త్రాలను కృష్ణాలయం అధ్యక్షులు యెలగందుల రాంచంద్రం బాలమణి దంపతులకు అందజేయడం జరిగింది.

ఈ సందర్బంగా రామకోటి రామరాజును కృష్ణాలయం అధ్యక్షులు యెలగందుల రామచంద్రం ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ భగవంతుని సేవకు మించిన భాగ్యం మరొకటి లేదన్నాడు. నేడు రామకోటి రామరాజు రామ నామమే ఎక లక్ష్యంగా భావించి చేస్తున్న సేవ అమోగమన్నాడు. అయన సేవకు భక్తిరత్న జాతీయ పురస్కారం రావడం ఆనందంగా ఉందన్నాడు.

GOD

SAKSHITHA NEWS