అరెస్ట్ లకి భయపడేది లేదు, ప్రజా సమస్యల మీద పోరాటం ఆగదు: మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
తాండూరు గిరిజన బాలికల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ జరిగి 15 మంది ఆసుపత్రి పాలైన ఘటనకి సంభందించి విద్యార్థులని పరామర్శించడానికి వెళ్తున్న మాజీమంత్రి సబితా ఇంద్ర రెడ్డి ని, సత్యవతి రాథోడ్ ని మరియు వికారాబాద్ జిల్లా BRS పార్టీ అద్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ని వికారాబాద్ మునిసిపల్ పరిధిలోని ఎన్నెపల్లి లో (హైదరాబాద్ – తాండూర్ రహదారి పై ) మర్రి చెన్న రెడ్డి విగ్రహం దగ్గర పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లకు తరలించడం జరిగింది.
దీనిపై వికారాబాద్ జిల్లా BRS పార్టీ అద్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ స్పందిస్తూ
- విద్యార్థుల ప్రాణాలు పోతుంటే వాటి మీద ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదు.
- BRS నాయకుల ఇల్ల నిర్భంధం, అరెస్ట్ ల మీద తప్ప ప్రజా సమస్యల మీద ఈ ప్రభుత్వానికి పట్టింపేది?
- ఏం పాపం చేశారని ఆ చిన్న పిల్లల ఆహారం కల్తీ అయితున్న పట్టించుకోవట్లేదు?
- ఇందిరమ్మ రాజ్యమంటే విద్యార్థులకి కల్తీ ఆహారం, అడిగితే అక్రమ అరెస్టులేనా?
- ఆరు గ్యారెంటీల సంగతి దేవుడెరుగు కనీసం విద్యార్థులకు మంచి ఆహారం అందించడం చేతకాలేదు ఈ ప్రభుత్వానికి.
- మీ సర్కారు నిర్లక్ష్యం మరియు దాష్టీకానికి పిల్లలు బలైపోతున్నారు, వారి ఆరోగ్య పరిస్థితి గురించి తల్లి తండ్రులకు నిద్ర పట్టటం లేదు.
- ఈ అక్రమ అరెస్ట్ లకి భయపడేది లేదు, ప్రజా సమస్యల మీద పోరాటం ఆగదు అన్నారు.