SAKSHITHA NEWS

తిరుపతి ఓటర్ నమోదు అధికారి హరిత ఐఏఎస్.


సాక్షిత : ఓటర్ల జాబితాలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా సిద్దం చేస్తున్నామని తిరుపతి ఓటర్ నమోదు అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అన్నారు.
తిరుపతి నియోజక ఓటర్ల జాబితాపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో తన ఛాంబర్ నందు కమిషనర్ సమావేశం అయ్యారు.


ఈ సందర్భంగా కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా ను పారదర్శకంగా సిద్దం చేసేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. తిరుపతి నియోజకవర్గ పరిధిలో 265 పోలింగ్ కేంద్రాలకు 265 మంది బూత్ లెవెల్ ఆఫీసర్ల ను నియమించామని అన్నారు. వీరు వీరి పరిధిలోని ఇంటింటికీ ఎవరైనా ఇల్లు మారారా, మరణించారా, మైగ్రేట్ అయ్యారా అని సర్వే నిర్వహించి రిపోర్ట్ సిద్దం చేస్తారని అన్నారు. 18 యేళ్లు నిండి ఓటు నమోదు చేసుకొని వారి వద్ద ఫార్మ్ 6 తీసుకోవాలన్నారు.

గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల వారికి ఏమైనా అనుమానాలు ఉన్నా బూత్ లెవెల్ ఏజెంట్, బూత్ లెవెల్ ఆఫీసర్ల తో కలసి నివృత్తి చేసుకోవాలన్నారు. వారి సరైన సమాధానం దొరకని పక్షంలో నేరుగా పై అధికారులను కలసి నివృత్తి చేసుకోవాలన్నారు. అలాగే ఎలక్షన్ డోర్ నంబర్లు ప్రతి ఇంటి వద్ద వేయించాలని ఎన్నికల సిబ్బందికి కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళిశ్వర్ రెడ్డి, స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, అర్బన్ ఎమ్మార్వో వెంకటరమణ, డి.టి.జీవన్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS