SAKSHITHA NEWS

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని రాం నరేష్ నగర్ లో నెలకొన్న పలు సమస్యలు మరియు వాటి పరిష్కారానికై తీసుకోవాల్సిన చర్యలపై, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి అధికారులతో, కాలనీ వాసులతో కలిసి పాదయాత్ర నిర్వహించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ రాం నరేష్ నగర్ కాలనీ వాసులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యలను పరిగణలోకి తీసుకోని, వారి విజ్ఞప్తి మేరకు కాలనీలలో పాదయాత్ర చేపట్టడం జరిగినది అని, ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, సంతులిత, సమగ్ర అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు. అదేవిధంగా కాలనీ వాసులు అందరూ కలిసి కాలనీ అభివృద్ధి లో భాగస్వాములు కావాలని, కాలనీ వాసులందరి సమిష్టి కృషి తో ఆదర్శవంతమైన కాలనీ గా తీర్చిదిద్దుతామని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు. ఏ చిన్న సమస్య ఐన తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అదేవిధంగా డివిజన్ లో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా కృషి చేస్తామని ఈ సందర్బంగా కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అధికారులు ఏఈ రాజీవ్, వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, రాం నరేష్ నగర్ కాలనీ వాసులు మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS