SAKSHITHA NEWS

పన్ను వసూళ్ల లో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది.

మున్సిపల్ కమిషనర్ పి . శ్రీ హరిబాబు..

చిలకలూరిపేట పట్టణ ప్రజలు 2024- 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన
మున్సిపాలిటీకి చెల్లించవలసిన పన్నులు ఈ నెలాఖరులోగా చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ పి.శ్రీ హరిబాబు అన్నారు.బుధవారం నాడు పట్టణ ప్రముఖులు వారి ఆస్తి పన్నుకి సంబంధించిన 10 లక్షల రూపాయల చెక్కును
రెవిన్యూ ఆఫీసర్సుబ్బారావు రెవిన్యూ ఇన్సపెక్టర్ గిరిబాబు,అడ్మిన్ సెక్రటరీ లు కలిసి మున్సిపల్ కమిషనర్ పి. శ్రీ హరిబాబు కు అందజేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గతంతో పోలిస్తే పన్ను వసూళ్ల లో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది,పురపాలక సంఘం పరిధిలో పన్ను వసూలుకు ప్రణాళిక ప్రకారం ఫిబ్రవరి నేల నుండి ఆటోలు, మైకుల ద్వారా, కరపత్రాలు పంచి… ప్రతి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించడం వల్లే ప్రజలే స్వచ్చందంగా ముందుకొచ్చి ఆస్తి పన్నులు చెల్లిస్తున్నారు అని తెలిపారు.

గత ఏడాది పన్ను వసూళ్ల పురోగతి లేక….

గత ఐదేళ్ల కాలం క్రితం వరకు కేవలం రెవెన్యూ ఆఫీసర్,రెవిన్యూ ఇనస్పెక్టర్,లు బిల్ కలక్టర్ మాత్రమే ఉండి పన్నులు వసూలు చేసేవారు. అప్పుడు సుమారుగా ఆర్ధిక సంవత్సరం ముగిసే నాటికి 65 నుంచి 75 శాతం వరకు వసూలు చేసే వారు.గత ప్రభుత్వం నియమించిన సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత పట్టణ పరిధిలో రెవెన్యూ కార్యదర్శులు 29 మంది అన్ని వార్డుల్లో ఉన్నారు. కానీ పురోగతి మాత్రం పన్నులు వసూళ్లు లో కనిపించడం లేదు.ఎక్కడ తప్పు జరుగుతుందో దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.వాస్తవానికి ప్రతి రెండు అర్ధ సంవత్సర లో పన్నులు వసూలు పై దృష్టి సారిస్తే నేడు ఈ పరిస్తితి వచ్చేది కాదు. ఈ పరిస్తితి మారితే తప్ప 100 శాతం పన్నులు వసూలు సాధ్యం కాదు,ఇలా ప్రతి ఏటా మొండి బకాయిల పెరిగిపోవడం తప్ప తగ్గడం ఉండదు.

100% శాతం పన్నుల వసూలు లక్ష్యంగా ప్రణాళిక.:ఆర్.ఓ సుబ్బారావు.

మున్సిపాలిటీలో ఆస్తి పన్ను బకాయిలు చాలా వున్నాయన్నాయాన్నారు.మున్సిపల్ కమిషనర్ శ్రీ హరిబాబు పర్యవేక్షణలో ఆస్తి పన్నుల వసూళ్లకు ప్రణాళిక ప్రకారం సమిష్టిగా కృషిచేస్తున్నామని.
100% శాతం పన్నుల వసూలు లక్ష్యంగా ప్రణాళిక ప్రకారం విధులు నిర్వహిస్తున్నామన్నారు. గత సంవత్సరం సుమారు కేవలం 60 శాతం మాత్రమే ఆస్తి పన్నులు వసూలు చేయడం జరిగిందని.రెండేళ్ళ కన్నా ఎక్కువ బకాయిలు ఉన్న సుమారు 1170 గృహలను గుర్తించి రెడ్ నోటీసులు జారీ చేశామని,భారీ మొత్తంలో పన్ను బకాయిలున్న మొండి బకాయి దారులకు లీగల్ నోటీసులు ఇవ్వడం జరిగింది.మున్సిపల్ యాక్ట్ ను అనుసరించి కుళాయి తొలగింపు,జప్తు చేసే చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. పట్టణ ప్రజలందరూ పన్నులు మార్చి 31 తేదీలోపు మీ దగ్గరలో వున్న సచివాలయాల్లో కాని, మున్సిపల్ కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ లలో పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి దోహదపడాలని
ఈ సందర్బంగా రెవెన్యూ ఆఫీసర్ సుబ్బారావు పుర ప్రజలను కోరారు.

ముఖ్య గమనిక…

మార్చి 31 నాటికి పన్ను బకాయి దారులు పన్ను చెల్లించని యెడల ఏప్రిల్ మొదటి వారంలో కోర్టులో కేసులు వేసి సదరు బకాయి దారుల నుండి డబ్బులు వసూలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకోబడుతుందని హెచ్చరించారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app