నివాళులర్పించిన టీఎస్ జేఏ నాయకులు

నివాళులర్పించిన టీఎస్ జేఏ నాయకులు

SAKSHITHA NEWS

The TS JA leaders paid tribute to the portrait of senior journalist Elka Saidulu Goud

సీనియర్ జర్నలిస్టు ఎల్క సైదులు గౌడ్ చిత్రపటానికి నివాళులర్పించిన టీఎస్ జేఏ నాయకులు
సాక్షిత, సూర్యాపేట జిల్లా ప్రతినిధి : ,ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ మృతి చెందిన సీనియర్ పాత్రికేయులు ఎల్క సైదులు గౌడ్ చిత్రపటానికి తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలో అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరు యాదగిరి పాల్గొని మాట్లాడుతూ ఎల్క సైదులు గౌడ్ గత 25 సంవత్సరాలుగా పాత్రికేయ రంగంలో వివిధ దినపత్రికల్లో వార్తా కథనాలు రాస్తూ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఎంతోమంది జీవితంలో వెలుగులు నింపారని, ఎన్నో సమస్యల పరిష్కారానికి ఆయన మార్గం చూపారని అన్నారు.

సైదులు గౌడ్ ఎక్కడ రాజీ పడకుండా తన కలం ద్వారా కథనాలు రాశారని గుర్తు చేశారు.

సైదులు గౌడ్ జర్నలిస్టు జీవితం నూతనంగా జర్నలిజంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆదర్శం అన్నారు.

సైదులు గౌడ్ తనకు ఎంతో కాలంగా పరిచయం,6మంచి మిత్రుడు అని అలాంటి జర్నలిస్టును కోల్పోవడం బాధాకరమైన విషయం అని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ఆయన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ కేంద్రంగా జర్నలిస్టు వృత్తిలో కొనసాగుతూ రాష్ట్ర వ్యాప్తంగా పరిచయం ఉన్న జర్నలిస్టు సైదులు గౌడ్ అని తెలిపారు.తమ అసోసియేషన్ తరపున ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధూపాటి శ్యాంబాబు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దుర్గం బాలు సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు లింగంపల్లి నాగబాబు,సూర్యాపేట నియోజకవర్గ నాయకులు దేశ గాని వెంకట్ గౌడ్ యాతాకుల మధుసూదన్ వల్దాసు శంకర్ తదితరులు పాల్గొన్నారు

The TS JA leaders paid tribute to the portrait of senior journalist Elka Saidulu Goud

SAKSHITHA NEWS