SAKSHITHA NEWS

జగిత్యాల పట్టణం బంద్… ప్రశాంతం…

సాక్షిత : బంగ్లాదేశ్ లో హిందువులపై, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ దాడులలో మృతి చెందిన వారికి మద్దతుగా జగిత్యాల హిందూ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణం బంద్…

పట్టణంలోని హోటల్లు వ్యాపార సంస్థలు మూసివేశారు. విద్యా సంస్థలు, హోటల్లు, ,షాపింగ్ సెంటర్లు, సినిమా థియేటర్లు, అందరూ స్వచ్ఛందంగా బందులో పాల్గొన్నారు…

పట్టణంలోని వ్యాపార వాణిజ్య కేంద్రాలలో హిందు సంఘాలు కలియ తిరుగుతూ బందుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు…

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రముఖ కూడళ్లలో బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో హిందూ ఐక్య వేదిక నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి, ACS రాజు, సిపెళ్ళీ రవీందర్,కిశోర్ సింగ్ ,నల్ల నారాయణ రెడ్డి ,బడే శంకర్ ,మదిశెట్టి మల్లేశం ,బండారి మల్లికార్జున్ ,నరెందుల శ్రీనివాస్ ,జిత్తవేణి అరుణ్ కుమార్,గజోజు సంతోష్ ,బిట్టు ,పులి శ్రీధర్ ,నీలగిరి వికాస్ రావు ,మైలరపు భార్గవ్ ,పవన్ ,లక్మ రెడ్డి ,వేముల పోచమల్లు ,శేకర్ ,నవ్వోతు సురేష్ ,ఎర్ర శ్రీను,కట్ట విజయ్ ,శ్రీరాములు అశోక్ ,పదం మహేందర్ ,మరియు బజరంగ్ దళ్ కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS