SAKSHITHA NEWS

జోగులాంబ గద్వాల్ జిల్లా క్షేత్రస్థాయిలో ముగిసిన ట్రెనీ సివిల్ సర్వీసెస్ అధికారుల పర్యటన

 ఐ.డి.ఓ.సి కాన్ఫరెన్స్ హాల్‌ నందు  ఆల్ ఇండియా సర్వీసెస్ (AIS), సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (CCS) 25 మంది శిక్షణాధికారులతో జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ సమావేశం నిర్వహించారు.                                                 గత వారం రోజులుగా  జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించి వివిధ ప్రభుత్వ పథకాలు, గ్రామాల్లో జరిగే కార్యక్రమాలు, ఇతర ప్రభుత్వ విభాగాల తమ పరిశీలన ఫలితాలను, అనుభవాలను కలెక్టర్ కు తెలిపారు. 

   ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్  అధికారులను అభినందిస్తూ, ఈ అనుభవాలు మీ భవిష్యత్ ఉద్యోగ జీవితంలో ఉపయోగపడతాయని, ప్రజాసేవ కోసం ఇది మంచి శిక్షణగా నిలుస్తుందని అన్నారు. అలాగే శిక్షణాధికారులు మాట్లాడుతూ గ్రామాల్లో జరుగుతున్న ప్రభుత్వ పథకాలు, పురపాలక సంస్థల పనితీరు, పాఠశాలలు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, గద్వాల్ జిల్లాలోని చేనేత పరిశ్రమ, ఆలయాలు, మార్కెటింగ్, ఉపాధి అవకాశాలు, ప్రసాద్ పథకం,మహిళా శక్తి పథకాలు వంటి అంశాలపై తమకు అవగాహన పెరిగిందని అన్నారు.ఈ క్షేత్రస్థాయి సందర్శన ద్వారా స్థానిక సమస్యలు, పథకాల ప్రభావం గురించి మరింతగా తెలుసుకున్నామన్నారు.

   ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ నర్సింగ రావు‌, జెడ్పీ సి.ఈ.ఓ కాంతమ్మ, ట్రెనీ ఆల్ ఇండియా సర్వీసెస్ (ఏఐఎస్), సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (సీసీఎస్) అధికారులు,సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు...

SAKSHITHA NEWS