కార్మికుల హక్కుల పరిరక్షణకే సర్వే.. త్వరలో న్యాయం చేస్తాం – అధికారులు…

Sakshitha news

కార్మికుల హక్కుల పరిరక్షణకే సర్వే.. త్వరలో న్యాయం చేస్తాం – అధికారులు…

వీవింగ్, స్పిన్నింగ్, టెక్స్టైల్ మిల్లుల భూములు, క్వార్టర్స్ సర్వే చేపట్టిన అంతర్గాం తహసిల్దార్ పడాల వరప్రసాదరావు…

పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల కేంద్రంలోని టీటీఎస్ అంతర్గాం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న వీవింగ్, స్పిన్నింగ్, టెక్స్టైల్ మిల్లుల భూములు , క్వార్టర్స్‌కు సంబంధించి బుధవారం సర్వే నిర్వహించారు.

రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ ఆంగోత్ రవికుమార్ నాయక్ ఆధ్వర్యంలో ఈ సర్వే కార్యక్రమం జరిగింది.
పెద్దపల్లి జిల్లా ఏడీ, అంతర్గాం తహసిల్దార్, రెవెన్యూ అధికారి పడాల వరప్రసాదరావు ఆధ్వర్యంలో రెవెన్యూ కార్యాలయ సిబ్బంది, లోకల్ కార్మికులు, బర్మా కాందీశీకుల కార్మికుల సమక్షంలో భూములు, క్వార్టర్స్‌ను పరిశీలించి సర్వే చేపట్టారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో లోకల్ కార్మిక సంఘం అధ్యక్షులు, బర్మా కాందీశీకుల సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన తహసిల్దార్ పడాల వరప్రసాదరావు మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల ద్వారా లోకల్ కార్మికులు, బర్మా కాందీశీకుల వీవింగ్, స్పిన్నింగ్, టెక్స్టైల్ కార్మికులకు త్వరలోనే న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అంతర్గాం తహసిల్దార్ పడాల వరప్రసాదరావు, గ్రామ సర్పంచ్ ఆంగోత్ రవికుమార్ నాయక్, ఉప సర్పంచ్ ఉషారాణి, పాలకవర్గ సభ్యులు, జీపీఓ జిల్లా అధ్యక్షులు మర్రి శంకర్ స్వామి, సంబంధిత ప్రభుత్వ అధికారులు, లోకల్, బర్మా కాందీశీకుల కార్మికులు, కార్మిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top