ఖమ్మం సభతో కమ్యూనిస్టుల బలం తెలిసిపోయింది.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.
భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిన్న ఖమ్మంలో జరిగినటువంటి భారీ బహిరంగ సభకు లక్షలాదిమంది సిపిఐ కార్యకర్తలు తరలిరావడం ఆహ్వానించదగ్గ పరిణామం అని దీన్ని చూసి కమ్యూనిస్టులను హేళన చేసేటువంటి రాజకీయ నాయకులకు చెంపపెట్టు లాంటిదని అన్నారు.
బూర్జవ పార్టీలు తమ పార్టీ మీటింగ్లకు కార్యకర్తలకు మందును డాబును బిర్యానీ పొట్లాలను ఇచ్చి తీసుకెళ్లే సంప్రదాయం కనిపిస్తున్న సందర్భంలో సిపిఐ పార్టీకి వచ్చేటువంటి కార్యకర్తలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా పేద ప్రజల కోసం కార్మికుల కోసం రైతుల కోసం మహిళల కోసం నిజంగా పోరాటం చేసేటువంటి పార్టీ కమ్యూనిస్టు పార్టీని అని అనుకోని స్వచ్ఛందంగా వచ్చే సంప్రదాయం కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలకు ఉందని ఈ విషయం బూర్జువా రాజకీయ పార్టీలకు చెందిన నాయకులకు కూడా తెలుసని అన్నారు. ఈ బహిరంగ సభ ద్వారా సిపిఐ కార్యకర్తల్లో నూతన ఉత్తేజం పెరిగిందని రానున్న రోజుల్లో ఈ సభను స్ఫూర్తిగా తీసుకొని సిపిఐ పార్టీని మరింత బలోపేతం చేసి సమ సమాజాన్ని నిర్మిద్దామని అన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
