
సిరిసిల్ల జిల్లాలో రాముడి విగ్రహం ధ్వంసం..?
రాజన్న జిల్లా
రాముడి విగ్రహం ధ్వంసం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలో ఈరోజు ఉదయం చోటు చేసుకుంది.
గ్రామంలోని కేసీఆర్ నగర్ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో గల హనుమాన్ ఆలయంలో ఏర్పాటు చేసేందుకు తీసుకువచ్చిన విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఉదంతం సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.
ఈ విషయం తెలుసుకున్న బిజెపి, హిందూ సంఘాల నాయకులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళన నిర్వహించారు.
రాముడి విగ్రహం ధ్వంసం చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీ సులు వెంటనే స్పందించి విగ్రహ ధ్వంసం కారకులను పట్టుకోవాలని, నూతన విగ్రహాలను ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను సముదాయించారు. అదే విధంగా మానేరు వంతెన పై సిరిసిల్ల – సిద్దిపేట రహదారి పై ధర్నా చేశారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app