SAKSHITHA NEWS

కాకాణి హౌస్ అరెస్ట్ – పరిస్థితి ఉద్రిక్తతం”

SPS నెల్లూరు జిల్లా: మాజీ మంత్రి మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి ని నెల్లూరులోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

సోమిరెడ్డి అవినీతిని బట్టబయలు చేసేందుకు రైతులతో కలిసి కనుపూరు కాలువకు బయలుదేరిన కాకాణిని పోలీసులు అడ్డుకొని గృహ నిర్బంధంలో ఉంచారు.

విషయం తెలుసుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాకాణి నివాసానికి భారీగా తరలిరావడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ విఫల యత్నం చేసి, చివరకు హౌస్ అరెస్ట్ చేయడంతో పోలీసులు పై మండిపడిన కాకాణి.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తాము సోమిరెడ్డిని అడ్డుకొని ఉంటే, అల్లీపురం నుండి కూడా బయటకు రాలేకపోయేవాడని ఘాటుగా విమర్శించిన కాకాణి.

సోమిరెడ్డి విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ, నవంబర్ 11వ తేదీ వరకు టెండర్లకు గడువు ఉన్న నామమాత్రంగా ముందుగానే పనులు ప్రారంభించి, కోట్లు కొల్లగొట్టడానికి వేసిన స్కెచ్ బహిర్గతం అవుతుందని సోమిరెడ్డి భయపడి పోలీసులను పురమాయించాడు.

సోమిరెడ్డి అవినీతికి, అక్రమాలకు అంతులేకుండా, కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని కొల్లగొడుతుంటే చూస్తూ ఊరుకుంటామా! అంటున్న కాకాణి.

పోలీసులు సోమిరెడ్డి అవినీతికి భద్రత కల్పిస్తూ, వాస్తవాలు తెలుసుకోవడానికి సోమిరెడ్డి దోపిడీ ప్రజలకు తెలియజెప్పడానికి బయలుదేరుతున్న తమను అడ్డుకోవడంతోనే కూటమి ప్రభుత్వ నైజం బయటపడిందన్న కాకాణి.

సోమిరెడ్డి అవినీతి పై పోరాటం కొనసాగుతుంది తప్ప వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన కాకాణి.


SAKSHITHA NEWS