SAKSHITHA NEWS

దివ్యాంగులకు కాంపోజిట్ రీజినల్ సెంటర్(సీఆర్సీ)లో అందిస్తున్న సేవలు అద్భుతం

అవసరమైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలి

వెంకటాచలం మండలంలోని ఎర్రగుంట వద్ద సీఆర్సీ సెంటరులో దివ్యాంగుల క్రీడాపోటీలను ప్రారంభించిన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

సీఆర్సీలో దివ్యాంగులకు అందిస్తున్న అన్ని సేవలపై ఆరా తీసిన సోమిరెడ్డి

జాతీయ స్థాయి ప్రమాణాలతో సేవలందించే సీఆర్సీ సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండటం సంతోషంగా ఉంది

ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్, క్లినికల్ సైకాలజీ, స్పీచ్ అండ్ ఆడియోలాజికల్ సేవలు, ప్రత్యేక విద్య, ఫిజియోథెరపీ, హైడ్రో థెరపి, ఆక్యుపెషనల్ థెరపీ, నైపుణ్యాభి వృద్ధి శిక్షణ తదితర అనేక సేవలు ఉచితంగా అందించడం శుభపరిణామం

ఈ సేవల వివరాలన్నింటిని గ్రామస్థాయిలోకి తీసుకెళ్లి అవసరమైన వారు సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించే బాధ్యత అందరిపై ఉంది

పెద్దాయన ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రత్యేక శ్రద్ధతో అనేక జాతీయ స్థాయి సంస్థలు మన సర్వేపల్లి నియోజకవర్గంలో ఏర్పాటయ్యాయి

సీఆర్సీకి నా వైపు ఎలాంటి సహకారం అవసరమైనా అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నా


SAKSHITHA NEWS