కాంగ్రెస్ అందించే పథకాలే అభ్యర్థుల విజయానికి పునాదులు : ఎమ్మెల్యే జారే
సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట మండలంలో
ఈ నెల 14వ తేదీన జరగనున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మండల వ్యాప్తంగా వివిధ గ్రామపంచాయతీలను సందర్శించారు. ప్రతి గ్రామంలో జరిగిన ప్రత్యేక సమావేశాలలో ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు ఎన్నికలలో విజయం కోసం అనుసరించాల్సిన ముఖ్యమైన వ్యూహాలను వివరించారు.
గ్రామీణాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, రెండు లక్షల రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల గృహ వినియోగ ఉచిత విద్యుత్, వ్యవసాయ ఉచిత విద్యుత్, మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్, సెంటర్ లైటింగ్ వ్యవస్థ, సీసీ రోడ్లు, సిసి డ్రైనేజీలు, బిటి రహదారులు, పంట పొలాలకు గ్రావెల్ రోడ్లు, నియోజకవర్గ వ్యాప్తంగా హైమాస్ట్ లైటింగ్ వ్యవస్థ, విద్యా ప్రమాణాల మెరుగుదలకు మౌలిక వసతుల కల్పన, సన్న బియ్యం, ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల కు పెంపు, వైద్యరంగంపై ప్రత్యేక చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం ఉచిత వైద్యం, చెరువుల పునరుద్ధరణ వంటి సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రతి ఇంటికి చేరేలా కార్యకర్తలు తీసుకెళ్లాలన్నారు. కాంగ్రెస్ అందించే పథకాలను అభ్యర్థులు విజయానికి పునాదులుగా మార్చుకోవాలని నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
