కేసీఆర్ పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి పనులే పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తాయని మాజీ మంత్రి,శ్రీమతి సత్యవతి రాథోడ్ ధీమా వ్యక్తం చేశారు.
డోర్నకల్,కురవి,నల్లెళ్ల :
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నల్లెళ్ల, గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో ఆదివారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ నూతనజిల్లా గా ఏర్పాటు చేసి గతంలో ఈ ప్రాంతానికి ఎవరు చేయని అభివృద్ధి బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని గుర్తు చేశారు.
అభివృద్ధే బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తుంది…
మహబూబాబాద్ జిల్లాను సుందరంగా తీర్చిదిద్దిన ఘనత మాదే అన్నారు సత్యవతి రాథోడ్
పల్లెల్లో గత పదేళ్లలో జరిగిన అభివృద్ధే ఇప్పటికీ కనిపిస్తున్నది
డోర్నకల్ నియోజకవర్గ పర్యటనలో మాజీ మంత్రి, శ్రీమతి సత్యవతి రాథోడ్
తాను (సత్యవతి రాథోడ్) మంత్రిగా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ జిల్లా మరియు నియోజకవర్గ అభివృద్ధి కోసం శ్రమించానని, తనకు కేటాయించిన నిధులన్నీ అధికభాగం జిల్లాకె కేటాయించినట్లు చెప్పారు. రెండేళ్ల క్రితం వరకు కళకళలాడిన పల్లెలు..ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో అభివృద్ధికి ఆమడ దూరంలో మగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటినీ అర్థం చేసుకొని పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ బలపరిచిన సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్ ది అని గుర్తు చేశారు.
ఆరు గ్యారెంటీల పేరుతో రూ.72 వేల కోట్లు ఖర్చు పెట్టామని ప్రభుత్వం గొప్పలకు పోతున్నదని, క్షేత్రస్థాయిలోకి వెళ్తే కళ్యాణలక్ష్మి, షాదీముభారక్ పథకాలకు తులం బంగారం, యువతులకు ఇస్తామన్న స్కూటీలు, మహిళలకు రూ.2,500ల ఊసే లేకుండా పోయిందని మండిపడ్డారు. ఇక రైతుబంధు నాట్ల సమయానికి వస్తుందన్న గ్యారెంటీ కూడా లేకుండా పోయిందన్నారు. నాట్లకు నాట్లకు రావాల్సిన రైతుబంధు.. ఓట్లకు ఓట్లకు ఇచ్చే పథకంలా తయారైందని ఎద్దేవా చేశారు. పదేళ్లలో ఏనాడూ లేని యూరియా కష్టాలు కాంగ్రెస్ పాలనలో మళ్లీ కనిపించాయని చెప్పారు.
జిల్లా లో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి..
బీఆర్‌ఎస్ బలపరిచిన నల్లెల అభ్యర్థి రెంటల కృష్ణ సౌమ్యుడని, అలాంటి వ్యక్తిని సర్పంచ్‌గా గెలిపించుకుంటే గ్రామం అభివృద్ధి సాధిస్తుందన్నారు మాజీ మంత్రివర్యులు, శ్రీమతి సత్యవతి

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
