SAKSHITHA NEWS

యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనలో పాలకులు విఫలం:
యువత స్వయం ఉపాధి పొందేందుకు ప్రభుత్వమే 25 లక్షల బ్యాంకు షూరిటీ ఇవ్వాలని డిమాండ్………. ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఏంటి కుతుబ్
వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను నెలకొల్పాలి

*సాక్షిత వనపర్తి :
యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని ఏ ఐ వై ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండి కుతుబ్ విమర్శించారు. వనపర్తి జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన జిల్లా కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, నిరుద్యోగులకు రూ. 3000 నిరుద్యోగ భృతి ఇస్తామని ఆశ చూపి మోసం చేసిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తున్న లక్ష ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదన్నారు. ఉద్యోగాల భర్తీలో వేగం పెంచాలన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వేరుశనగ, పత్తి వివిధ రకాల పంటలు పండుతాయని వ్యవసాయ పంటల అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నారు. పలుగురాయి, సున్నపురాయి, నాపరాయి, వెదురు పలు రకాల ఖనిజాలు దొరుకుతాయని అందుకు అనుగుణంగా పరిశ్రమలు పెట్టాలన్నారు. వనపర్తి లోని అనేక వనరులు ఉన్నాయని పరిశీలించాలన్నారు. స్వయం ఉపాధి కింద పరిశ్రమలు పెట్టుకుని నిరుద్యోగులకు ప్రభుత్వ గ్యారంటీతో రూ. 25 లక్షల వరకు బ్యాంకు లోన్లను ఇవ్వాలన్నారు. అంతవరకు రూ. 5000 నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాయకులు రమేష్, మహేష్,శివ,తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 08 10 at 16.15.05

SAKSHITHA NEWS