SAKSHITHA NEWS

రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఎన్డీఏ ప్రభుత్వ పాలన.

ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు.

మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు

గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో ఘనంగా 75 వసంతాల భారత రాజ్యాంగం దినోత్సవ వేడుకలు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి ఘనంగా నివాళులు.

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్,

విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో 75 వసంతాల రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ

‘ప్రజాస్వామ్యం అనేది ప్రజల హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, వంటి మౌలిక విలువలపై ఆధారపడి ఉంటుంది. ఈ విలువలను పరిరక్షించడం, ప్రజాస్వామ్య వ్యవస్థను విజయవంతంగా నిర్వహించడం రాజ్యాంగం యొక్క ప్రధాన బాధ్యత.

రాజ్యాంగం అనేది దేశ ప్రజల హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం వంటి మౌలిక విలువలను పరిరక్షించే పటిష్ఠమైన కవచం. ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో రాజ్యాంగం పాత్ర అసాధారణమైనది.

దేశ ప్రజల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షించే సమున్నత ఆశయంతో 395 ఆర్టికల్స్, 8 షెడ్యూళ్ళు (ప్రస్తుతం 12 షెడ్యూళ్ళు), 22 భాగాలతో ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగంగా అవతరించింది మన భారత రాజ్యాంగం.

భారతదేశం సమగ్రతను, స్వేచ్ఛను, సమానత్వాన్ని కాపాడుతూ ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఎంతో సాహసోపేతమైన రాజ్యాంగ రచనకు నాయకత్వం వహించిన మహనీయులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ , రూపకర్తల కృషి అజరామరం.

రాజ్యాంగం మన ప్రజాస్వామ్యానికి నైతికమైన, చట్టపరమైన, వ్యవస్థాగత బలాన్ని అందిస్తూ ప్రజాస్వామ్యాన్ని దృఢంగా నిలబెట్టింది. భారత రాజ్యాంగ రచనను 1949 నవంబర్ 26న భారత రాజ్యానికి సమర్పించిన రోజున దేశ ప్రజలందరు రాజ్యాంగానికి విధేయత ప్రకటించారు.

రాజ్యాంగం ప్రజలకు మౌలిక హక్కులు, ఆర్థిక సమానత్వం, సామాజిక న్యాయం కల్పిస్తుంది. ప్రజల ఆకాంక్షలను నేరవేర్చుతూ, ఆశయాలను సాధించే ఒక మార్గదర్శిగా కూడా నిలుస్తుంది.

ఎన్డీఏ మహాకూటమి ప్రభుత్వం రాజ్యంగ విలువలకు అనుగుణంగా ఏపీలో పాలన కొనసాగిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో ఏపీ ఫరిడవిల్లుతోంది.’ అని పేర్కొన్నారు. ఎన్డీఏ మహాకూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS