
30 ఏళ్ల మందకృష్ణ మాదిగ కృషి ఫలితం ఈ వర్గీకరణ తీర్మానం
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : ఎమ్మార్పీఎస్ అధినేత పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ చట్టం అయిన తర్వాతనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ మార్చి 9 నుండి మహాజన సోషలిస్టు పార్టీ(ఎం ఎస్ పి) జిల్లా అధ్యక్షుడు యాతాకుల రాజన్న మాదిగ , ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చింత వినయ్ బాబు మాదిగ ఆధ్వర్యంలో నిరవధిక దీక్షలు చేపట్టారు. 10 వ రోజు కొనసాగుతున్న సందర్భంగా ఈ దీక్షలకు ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జాతీయ నాయకులు గుద్దేటి ఎల్లయ్య మాదిగ మరియు చింతలపాటి చిన్న శ్రీరాములు మాదిగ హాజరై మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధనకై మహాజననేత మానవతా ఉద్యమాల పితామహుడు పద్మశ్రీ అవార్డ్ గ్రహీత మందకృష్ణ మాదిగ నాయకత్వంలో గత 30 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం చేస్తూ సమాన హక్కుల సామాజిక న్యాయ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ నేడు అసెంబ్లీలో రూపుదిద్దుకోవడానికి నిర్విరామ కృషి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ దే అని వారికి జాతి యావత్తు రుణపడి ఉంటుందని కొనియాడారు.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పటిష్టంగా అమలు చేయాలని అన్ని ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ల వర్గీకరణ నిబద్ధత అమలుపరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేటి దీక్ష శిబిరంలో ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్ పి నాయకులుమహాజన సోషలిస్టు పార్టీ (ఎం ఎస్ పి) సూర్యాపేట జిల్లా అధ్యక్షులు యాతాకుల రాజన్న మాదిగ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు చింత వినయ్ బాబు మాదిగ, ఎర్ర వీర స్వామి మాదిగ, బొజ్జ సైదులు మాదిగ, బోడ శ్రీరాములు మాదిగ, , మారేపల్లి సావిత్ర మాదిగ పిడమర్తి నాగేశ్వరి మాదిగ, గంటా బిక్షపతి మాదిగ, ములకలపల్లి మల్లేష్ మాదిగ, దైవ వెంకన్న మాదిగ పుట్టల మల్లేష్ మాదిగ గార కనకన్న మాదిగ, సూరారపు జానీ మాదిగ, చింత సతీష్ మాదిగ, తాటిపాముల నవీన్ మాదిగ, నకిరేకంటి భార్గవ్ మాదిగ,పంతం లింగయ్య మాదిగ,మామిడి మల్లయ్య మాదిగ, చింత మధు మాదిగ, దర్శనాల సతీష్ మాదిగ, చింత సైదులు మాదిగ,తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app