SAKSHITHA NEWS

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

టీఎస్ జేఏ మొదటి మహాసభలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో అన్ని యూనియన్లను కలుపుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిర్వహించిన అసోసియేషన్ మొదటి మహాసభలో పాల్గొని మాట్లాడారు.అన్ని జిల్లాలలో ప్రెస్ క్లబ్ భవనాలు నిర్మించాలన్నారు.వర్కింగ్ లో ఉన్న ప్రతి జర్నలిస్టుకు ఎటువంటి ఆంక్షలు లేకుండా అక్రిడేషన్లు హెల్త్ కార్డులు పోలీస్ భరోసా కార్డులు ఇవ్వాలన్నారు.ప్రతి జర్నలిస్టు కుటుంబానికి ఇంటి స్థలాలు లేదా పక్క ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా ఎటువంటి వేతనాలు లేకుండా ప్రజలకు ప్రభుత్వానికి ఉచితంగా సేవ చేస్తున్న జర్నలిస్టులకు ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలన్నారు.ఇంకా జర్నలిస్టులకు ఎన్నో సమస్యలు ఉన్నాయని వాటన్నింటినీ పరిష్కరించాలని యాదగిరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.ఈ సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లింగంపల్లి నాగబాబు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గౌస్ ఉద్దీన్,రాష్ట్ర కోశాధికారి కొరివి సతీష్ యాదవ్,రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దుర్గం బాలు,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గట్టిగుండ్ల రాము,రాష్ట్ర ప్రచార కార్యదర్శి గొట్టే నాగరాజు యాదవ్,రాష్ట్ర సహాయ కార్యదర్శులు చిలుకల చిరంజీవి, రామకృష్ణారెడ్డి,ఉమ్మడి నల్లగొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మామిడి సైదయ్య అదేవిధంగా జిల్లాల నియోజకవర్గాల మండలాల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS