SAKSHITHA NEWS

పేదల పెన్నిధి కల్వకుర్తి మాజీసర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ఏ
600 మంది నిరుపేద ముస్లిం మైనార్టీల కోసం రంజాన్ పండుగ సందర్భంగా 16 రకాల నిత్యవసర సరుకులను 600 మందికి పంపిణీ*


నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని సిల్వర్ జూబ్లీ క్లబ్ పక్కన ఉన్న జి ఎస్ ఆర్ ఆఫీసులో కల్వకుర్తి మాజీ సర్పంచ్ భృంగి ఆనంద్ కుమార్ నిరుపేద ముస్లింలను దృష్టిలో పెట్టుకొని రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ పండుగకు కావలసిన వివిధ16 రకాల నిత్యవసర సరుకులను600 నిరుపేద ముస్లిం మైనార్టీ లకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ ముస్లింల అభివృద్ధి కి కృషి చేస్తున్నారని అన్నారు.

కల్వకుర్తి నిరుపేద ముస్లిం మైనార్టీ లకు తమ వంతు సహాయం చేయాలని ఉద్దేశంతో రంజాన్ పండుగ సందర్భంగా పండుగకు కావలసిన బియ్యం.నూనె.పప్పు.పంచదార. వివిధ16 రకాల నిత్యవసర సరుకులను పంపిణీ చేయడం జరుగుతుందని పేద ధనిక తేడా లేకుండా పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఉద్దేశంతో పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ముస్లిం మైనార్టీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ షానవజ్ ఖాన్.కో. నెంబర్. సాబేర్. కౌన్సిలర్లు.గోరటి శ్రీనివాసులు. ఎజాజ్. చిన్న రామ్ రెడ్డి. శ్రీధర్ రెడ్డి. హనుమాన్ నాయక్. విజయలక్ష్మి సతీష్. పద్మా చిన్న. ప్రవీణ్ కుమార్. ఆనంద్ అన్న యువసేన సభ్యులు. ప్రముఖ ముఖ్యనాయకులు ముస్లిం మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS