SAKSHITHA NEWS

జాతిపిత బాపూజీ చూపించిన మార్గం నేటి తరానికి ఆదర్శం
ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి

కనిగిరి సాక్షిత :
కనిగిరి నియోజకవర్గం కనిగిరి పట్టణంలోని పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఎంతో మందికి స్ఫూర్తినింపారని, శాంతి, అహింస అనే నినాదంతో తెల్లవాళ్లను ప్రాలదోలి భారతావనికి స్వేచ్ఛ స్వాతంత్రం అందించిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ గాంధీజీ ఆశయాలను కొనసాగించాలని తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలో ఎక్కడాలేని విధంగా వాట్సప్ గవర్నెన్స్ ను ప్రారంభిస్తున్నామని ప్రజలకు 161 సేవలు వాట్సాప్ ద్వారా అందనున్నాయన్నారు. సూపర్ సిక్స్ పథకాలాన్ని త్వరలో అమలు అయ్యేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ దావోస్ వెళ్లొచ్చాక పరిశ్రమలు ఏపీకి భారీగా తరలివస్తున్నాయని చంద్రబాబు విజన్ ఏంటో, చంద్రబాబుపై ఉన్న నమ్మకం ఏంటో ప్రపంచం చూస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు తమ్మనేని శ్రీనివాసులు రెడ్డి, తెలుగు యువత అధ్యక్షులు షేక్ ఫిరోజ్, జిల్లా మాజీ కోఆప్షన్ సభ్యులు షేక్ షరీఫ్, రాచమల్ల శ్రీనివాసులు రెడ్డి తదితర టిడిపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app