SAKSHITHA NEWS

సంక్రాంతి తర్వాత రైతుభరోసా.. కొత్త రూల్స్ ఇవే.. వారికి కట్..!!

సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి నిన్న ప్రకటించారు. అయితే.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా మంజూరుకు సంబంధించి విధివిధానాలు ఖరారు చేస్తామని ఆయన చెప్పారు.

అయితే.. రైతు భరోసా విధివిధానాలు ఎలా ఉండబోతున్నాయి? అన్న టెన్షన్ రైతుల్లో వ్యక్తం అవుతోంది. వందల ఎకరాల భూమి ఉన్న వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు రైతుబంధు ఇస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తోంది. ఆదాయపు పన్ను కట్టే వారికి రైతు భరోసా కింద సాయం చేయడం ఏంటని ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలో ఇలాంటి వారికి రైతు భరోసా ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. మరో వైపు రైతుభరోసాకు సీలింగ్ కూడా విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐదు లేదా పది ఎకరాల్లోపు భూమి ఉన్న వారికి మాత్రమే రైతు భరోసా ఇచ్చేలా విధివిధానాల్లో స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో వైపు సాగుతో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ వెంచర్లు, సాగు చేయని భూములకు రైతు భరోసా నిరాకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వీటితో పాటు ఇంకా ఎలాంటి నిబంధనలు తీసుకువస్తారన్న అంశంపై రైతుల్లో ఉత్కంఠ నెలకొంది.

రెండు సీజన్లవి కలిపి ఇస్తారా?

ఇంకా.. ఈ వర్షాకాలం సీజన్ కు సంబంధించి రైతు భరోసా నిధులను రేవంత్ ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు. ఇప్పుడు ఆ నిధులను కూడా విడుదల చేస్తారా? లేదా కేవలం రబీ సీజన్ నిధులను మాత్రమే విడుదల చేస్తారా? అన్న అంశంపై కూడా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. రైతు భరోసా పథకం విధివిధాలను ఖారు చేసేందుకు రేవంత్ సర్కార్ కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చైర్మన్ గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సభ్యులుగా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావును నియమించిది. వీరు త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. ఆ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించిన అనంతరం విధివిధానలను ఫైలన్ చేయనుంది ప్రభుత్వం.


SAKSHITHA NEWS