తిరుపతి తొక్కిసలాట ఘటన పై ఎన్డీయే ప్రభుత్వం లోతైన విచారణ చేపట్టాలి.
బాధిత కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలి. సిపిఐ ఇన్చార్జి, కార్యదర్శి తాళ్లూరి బాబురావు డిమాండ్.
చిలకలూరిపేట:తిరుపతి శ్రీహరి వైకుంఠ దర్శనం టోకెన్ల కోసం వచ్చిన భక్తులను పద్మావతి పార్క్ లో ఉంచారు. అప్పుడే ఓ మహిళ అస్వస్థతకు గురికావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు సిబ్బంది గేటు తెరిచారు. టోకెన్లు ఇచ్చేందుకే గేటు తెరిచారని భావించిన భక్తులు ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చారని దీంతో తొక్కిసలాట జరిగిందని,క్యూలైన్ల వద్ద సిబ్బంది ఓవరాక్షన్ తొక్కిసలాటకు కారణమని,ఈ విషయమై పలు టీవీ ఛానల్ లో ప్రత్యక్షంగా ప్రసారం కావడం జరిగిందని దీనిపైన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నామని సిపిఐ నియోజవర్గ ఇన్చార్జి, కార్యదర్శి తాళ్లూరి బాబురావు అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం లోతైన విచారణ చేపట్టాలన్నారు.
ఈ ఘటనలో తప్పెవరిది అనేదానిపై చర్చ జరుగుతోందని, టికెట్లు దొరకవేమోనన్న కంగారుతో భక్తులు ఒక్కసారిగా తోపులాడుకోవడం తప్పు… ఒకేసారి గేట్లు తెరవడం పోలీసులది తప్పు ఉందని, టికెట్ల జారీపై నిర్దిష్ట ప్రమాణాలు పాటించకపోవడం, ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే అంచనా వేయలేకపోవడం టీటీడీది తప్పు అని ఆయన ఆరోపించారు.తొక్కిసలాటకు అధికారుల అతి ప్రవర్తన, నిర్లక్ష్యమే కారణమని,గేటు వద్ద నిలబడ్డ పోలీసులు భక్తులను ఇష్టం వచ్చినట్లు పోలీసులు లాగి పడేశారు. ఈక్రమంలో కొందరు కింద పడిపోయారని దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయని, మహిళలని చూడకుండా దారుణంగా ప్రవర్తించారని,భక్తులపై ఓ పోలీస్ లాఠీఛార్జ్ చేశారని,ఇది కూడా తొక్కిసలాటకు ఓ కారణమని, అక్కడున్న పోలీసులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు కోటీ పరిహారం ఇవ్వలన్నారు.