SAKSHITHA NEWS

రౌడీయిజంపై చట్టం ఉక్కుపాదం మోపుతుంది

తెనాలి పోలీసు డివిజన్లో రౌడీయిజంపై ఉక్కుపాదంతో అణచనున్నామని తెనాలి SDPO రమేష్ అన్నారు. 3 వపట్టణ స్టేషన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్తమాన సమాజంలో సామాన్యునిపై నిర్భంధించే రౌడీలపట్ల చట్టం ఉపేక్షించదని తమ IG SR త్రిఫాఠి SP సతీష్ కుమార్ ఆదేశాలతో తన డివిజన్లోని 336రౌడీషీటర్ల పై నిఖా పెంచనున్నామన్నారు. వారి వ్యాపకాలపై తమ సిబ్బంది నిరంతరం దృష్టిసారించి సమాజానికి కీడు కల్పిస్తే PD చట్టం అమలు చేస్తామని ఇంకా వినకపోతే ప్రభుత్వఅనుమతితో నగర బహిష్కరణ చేస్తామని ఆవేశంగా అన్నారు,

రాజీ ప్రతిపాదన అంగీకరించలేదన్న కోపంతో రౌడీషీటర్ “అప్పు” “నానీ”లు తమ బృంద రౌడీలతో దోమరాకెష్ పై దాడి చేసి గాయపర్చినందున తెనాలి 3వ పట్ణణ ఠాణాలో వారందరిని అరెష్టు చేసిన CI S. రమేష్ బాబు SI N.ప్రకాశరావు వారి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.

ప్రతిశనివారం రౌడీషీటర్లపై ఆయా ఠాణాలలో నిఖా పెంచనున్నామని అన్నారు.

ఫోటో:-3వ పట్టణ పోలీస్టేషన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న DSP రమేష్ బాబు.


SAKSHITHA NEWS