SAKSHITHA NEWS

సికింద్రాబాద్ : ప్రభుత్వం తాజాగా చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వే వల్ల ప్రజలకు మేలు చేకురితేనే మంచిదని, ప్రజల్లో ఉన్న అపోహలను ప్రభుత్వం నివృత్తి చేయాల్సి ఉందని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గo పరిధిలో ‘సమగ్ర ఇంటింటీ కుటుంబ సర్వే’ ప్రక్రియను తీగుల్ల పద్మారావు గౌడ్ సితాఫలమండీ లోని టీ.ఆర్.టీ. క్వార్టర్స్ లో లాంచనంగా ప్రారంభించారు. అంతకు ముందు సితాఫలమండీ లోని ఎం.ఎల్.ఏ. క్యాంపు కార్యాలయంలో సర్వే నిర్వహణా తీరుతెన్నుల పై జీ.హెచ్.ఎం.సీ. డిప్యూటీ కమీషనర్ సుభాష్ రావు నేతృత్వంలోని అధికారులతో సమగ్రంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వాలు ప్రజలకు ఉపకరించే కార్యక్రమాలను చేపట్టాల్సి ఉందని స్పష్టం చేశారు. సర్వే బృందాలు ప్రతి కుటుంబాన్ని సందర్శించాలని ఆయన సూచించారు. కార్పొరేటర్లు డాక్టర్ సామల హేమ, రాసురి సునీత రమేష్, కంది శైలజ, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, అధికారులు, నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్వే కార్యక్రమంలో భాగంగా టీ.ఆర్.టీ. క్వార్టర్స్ లోని వివిధ నివాసాలను పద్మారావు గౌడ్, కార్పొరేటర్లు, అధికారులు సందర్శించి పౌరులకు అవగాహన కల్పించారు.


SAKSHITHA NEWS