అందుల కోసం ప్రత్యేక లిపిని సృష్టించిన మహానీయుడు లూయిస్ బ్రెయిలీ…….. అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్
సాక్షిత వనపర్తి
అంధుల కోసం ప్రత్యేక లిపిని సృష్టించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు లూయిస్ బ్రెయిలీ అని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్ పేర్కొన్నారు.
కలెక్టరేట్‌లో ని జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో లూయిస్ బ్రెయిలీ 216 జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మమ్మ ఆధ్వర్యంలో కార్యక్రమానికి వచ్చిన అంధులతో కలిసి కేక్ కట్ చేశారు.
అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అంధులు సామాన్యులతో సమానంగా అన్ని రంగాల్లో ముందుండేలా ఆలోచించి లూయిస్ బ్రెయిలీ ఆరు చుక్కలతో కూడిన లిపిని తయారు చేశారన్నారు. అంధుల కోసం ప్రత్యేక లిపిని సృష్టించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు లూయిస్ బ్రెయిలీ అని చెప్పారు. ప్రస్తుతం అందులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, అందుకు మన జిల్లాలో ఉన్న ప్రభుత్వ ప్రధానోపాధ్యాయురాలు పెరవలి గాయత్రి, బ్యాంకు ఉద్యోగి మధు ఉదాహరణ అని చెప్పారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ప్రభుత్వ ప్రధానోపాధ్యాయురాలు పెరవలి గాయత్రి, బ్యాంకు ఉద్యోగి మధు సహా పలువురు అంధులను సన్మానించారు. అదేవిధంగా, అంధులకు వాకింగ్ స్టిక్స్ అందజేశారు.
కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మమ్మ, సంక్షేమ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు