SAKSHITHA NEWS

అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలి

-సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించడం బాధాకరం
-ఎస్సీ వర్గీకరణ ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు దేశవ్యాప్త సమస్య
-ఎస్సీ వర్గీకరణ అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలి
-మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఆకుమర్తి చిన్న మాదిగ ఘాటు విమర్శ

సాక్షిత రాజమహేంద్రవరం, :
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ స్వరాలు అందరికీ సమానంగా అందాలని మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఆకుమర్తి చిన్న మాదిగ పేర్కొన్నారు. రాజమండ్రి రూరల్ బొమ్మూరు లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ‌ ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టులో జస్టిస్ చంద్ర చూడ్ అధ్యక్షతన ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు బహిరంగంగా వ్యతిరేకించడం బాధాకరమని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగంలో అందించిన రిజర్వేషన్ ఫలాలు అందరికీ సమానంగా అందాలని అన్నారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినప్పటికీ మాదిగలకు రిజర్వేషన్ ఫలాలు అందలేదని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానం ఉంటే ఇప్పటివరకు మాలలే పోటీ చేశారని మాదిగలకు అవకాశం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ రాజ్యాంగం పై నమ్మకం ఉన్నవారు సుప్రీంకోర్టు లో కేసు వేసి సాధించుకోవాలని కోరారు. దేశవ్యాప్తంగా బంద్ నిర్వహించడం హర్షనియం కాదని అభిప్రాయపడ్డారు. మాలల్లో కొంతమంది సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నారని తెలిపారు. మాలలకు నిజంగానే అన్యాయం జరుగుతే సాంజితంగా పోరాటం ద్వారా హక్కులను సాధించుకోవాలని సూచించారు. భారత్ బంద్ పేరుతో వర్గీకరణ పై మాట్లాడకుండా కలకత్తాలో మహిళా డాక్టర్ పై జరిగిన హత్య అత్యాచారంపై మాట్లాడుతున్నారని వివరించారు. మాల మాదిగలు ఇక నుంచి కలిసి ఉండి రాజ్యాధికారం సాధించే వైపు వెళ్దామని అన్నారు. ఎస్సీ వర్గీకరణ తెలుగు రాష్ట్రాల్లో సమస్య మాత్రమే కాదని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా వర్గీకరణను మేనిఫెస్టోలో పెట్టారని తెలిపారు. పనులు 1975లో పంజాబ్ ప్రభుత్వం, 1994 హర్యానాలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అమల్లో ఉందని అన్నారు. గత 30 సంవత్సరాల కాలంగా ఎస్సీ వర్గీకరణకు పోరాటం సాగిస్తున్న ఎమ్మార్పీఎస్ పోరాటం ఫలితంగా ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పు ఇచ్చిందని అన్నారు. కొంతమంది స్వార్థపరులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని వ్యతిరేకించడం దురదృష్టకరమని అన్నారు. వర్గీకరణ అంశంపై మాలలు బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. ఒక తండ్రి ఇచ్చిన ఆస్తిని సోదరులు సమానంగా పంచుకోవాలని, ఒక్కరే అనుభవించాలని చూడడం న్యాయమా అని ప్రశ్నించారు. హర్ష కుమార్ కి ఇద్దరు కొడుకులు ఉన్నారని తన ఆస్తిని ఇద్దరు కొడుకులు సమానంగా పరుస్తారా లేక ఒక కొడుకే ఇస్తారా నిలదీశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల కు విఘాతం కలిగించేందుకు మాజీ ఎంపీ జీవీఆర్ కుమార్ మాల సోదరులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ కోసం గత 30 సంవత్సరాలు కాలంగా ఎందరో యువకులు ప్రాణ త్యాగాలు చేశారని పేర్కొన్నారు. జనాభా తమాషా ప్రకారం ఎస్సీలలో 59 ఉప కులాలకు సమానంగా రిజర్వేషన్ ఫలాలు అందుతాయి అన్నారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలమా వ్యతిరేకమా ప్రకటించాలని కోరారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకమైతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాదిగలు పార్టీ నుంచి బయటకు రావాలని కోరారు. అలాగే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తున్న బీఎస్పీ పార్టీలో ఉన్న మాదిగలు పార్టీ నుంచి బయటకు రావాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చి అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయని ఆ ప్రభుత్వాలలో కాపాడుకుంటామని అన్నారు. ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ మన రాష్ట్రంలో పుట్టింది కాదని వివరించారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో మాదిగలను రెచ్చగొడుతున్నారని కొందరు చేస్తున్న ఆరోపణలు వాస్తవం లేదని అన్నారు. మాదిగలకు సమాన అవకాశాలు కల్పించాలని తప్ప రెచ్చగొట్టే అవకాశం లేదని అన్నారు. పోలీస్ శాఖలో న్యాయవ్యవస్థకు వ్యతిరేకించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యా, ఉద్యోగ, రాజకీయ, ఆర్థికంగా మాదిగలకు ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు ఆర్డినెన్స్ తెచ్చి రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని కోరారు. రిజర్వేషన్లు నీ కులాల వారికి సమానంగా పంపిణీ జరగాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక సభ్యులు పసలుపూడి శ్రీనివాస్, రాజమండ్రి డివిజన్ అధ్యక్షులు రాచర్ల మురళి, కొమ్ము వెంకటరావు, సిందే హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 08 21 at 17.46.53

SAKSHITHA NEWS