యాదవుల ఐక్యతను చాటే వేడుక సదర్ ఉత్సవాలని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాత్రి నగరంలోని మాదాపూర్, ఖైరతాబాద్ లోని బడా గణేష్ మండపం వద్ద, బోయిన్ పల్లి, చంచల్ గూడ, అమీర్ పేట లలో యాదవ సంఘాల ఆద్వర్యంలో నిర్వహించిన సదర్ ఉత్సవాలలో మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్, హుజూరాబాద్ MLA పాడి కౌశిక్ రెడ్డి తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంతో సుందరంగా ముస్తాబు చేసిన దున్నపోతుల విన్యాసాలను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ కృష్ణుని వారసులైన యాదవులు దీపావళి పండుగ తర్వాత ప్రతి సంవత్సరం ఈ సదర్ ను ఎంతో ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని వివరించారు. సదర్ ఉత్సవాల సందర్భంగా నిర్వహించే దున్నపోతుల విన్యాసాలను చూసేందుకు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున వస్తారని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో నిర్వహకులు శాలువాతో ఘనంగా సన్మానించి మెమెంటో లను అందజేశారు.
యాదవుల ఐక్యతను చాటే వేడుక సదర్ ఉత్సవాలని మాజీమంత్రి,
Related Posts
గోదాదేవి పూల మాల కైoకర్య సేవలో
SAKSHITHA NEWS గోదాదేవి పూల మాల కైoకర్య సేవలో……………మున్సిపల్ కౌన్సిలర్ దంపతులు సాక్షిత వనపర్తి :జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా 33వ వార్డుమున్సిపల్ కౌన్సిలర్ దంపతులు ఉంగ్లం అలేఖ్య తిరుమల్ గోదాదేవి పూలమాల కైంకర్య…
అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన చైర్పర్సన్
SAKSHITHA NEWS అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన చైర్పర్సన్. జగిత్యాల:- జిల్లా కేంద్రంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ జెడ్పీ కార్యాలయంలో అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డిని మర్యదపూర్వకంగా కలిసి స్వీట్స్ అందించి నూతన…