ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ

Sakshitha news

సిద్దిపేట

 ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ జిల్లాలో పూర్తి పారదర్శకంగా జరిగేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కే హైమావతి సూచించారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, మహిళా సమాఖ్య ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం పై దిశా నిర్దేశం చేశారు.

 ఈ సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి మహిళా సమైక్య సభ్యులతో కలిసి వీ.సీలో పాల్గొన్న  జిల్లా కలెక్టర్  కే.హైమావతి  జిల్లాలో చీరల పంపిణీకి ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తామని ముఖ్యమంత్రికి వివరించారు.

అనంతరంపలు మహిళా సమైక్య సభ్యులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో “మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి” కార్యక్రమం పేరుతో ఇందిరమ్మ చీరల పంపిణీకి చర్యలు తీసుకున్నామని అన్నారు. ఎలాంటి విమర్శలు, పొరపాట్లకు తావులేకుండా క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర పంపిణీ అయ్యేలా సమాఖ్య ప్రతినిధులు కృషి చేయాలని అన్నారు. చీరల పంపిణీ కార్యక్రమం పర్యవేక్షణ కోసం నియోజకవర్గానికి ఒకరు చొప్పున స్పెషల్ ఆఫీసర్ ను నియమిస్తున్నామని అన్నారు. సిద్దిపేట, గజ్వేల్ , హుస్నాబాద్ నియోజకవర్గంలకు స్థానిక ఆర్డిఓ లను స్పెషల్ ఆఫీసర్లుగా నియమిస్తున్నామని దుబ్బాక నియోజకవర్గంకు ఒక సీనియర్ అధికారిని నియమిస్తామని అన్నారు.

ప్రజా ప్రతినిదుల సమక్షంలో చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినిర్ణీత గడువు లోపు చీరల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కోసం ప్రతి గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన యువతులు, మహిళల వివరాలను పక్కాగా సేకరించాలని సూచించారు.
కాగా, రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఇతోధికంగా తోడ్పాటును అందిస్తూ, అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని కలెక్టర్ గుర్తు చేశారు. ప్రభుత్వ తోడ్పాటుతో మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించడమే కాకుండా సామాజికంగా కూడా ప్రగతి పథంలో పయనించేలా సమాఖ్యలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, ట్రైనీ, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, డీపీఓ వినోద్ కుమార్, జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలు టి. రేణుక, మున్సిపల్ కమిషనర్లు, మహిళా సమాఖ్య ప్రతినిధులు, ఏపీవోలు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం సిద్దిపేట జిల్లా వారిచే జారీ చేయనైనది

Scroll to Top