SAKSHITHA NEWS

మున్సిపల్‌ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి

‌అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్

నేడు మున్సిపల్ చైర్మన్ G చిన్న దేవన్న తో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలన

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పురపాలక సంఘం పరిధిలో వివిధ అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ శ్రీ B M సంతోష్ మునిసిపల్ చైర్మన్ _G చిన్న దేవన్న తో క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

జిల్లా కలెక్టర్ గారు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ దగ్గర నిర్మించిన వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను, పెద్ద వాగుపై బ్రిడ్జి నిర్మాణం ను, నర్సరీ, SC కాలానికి వెళ్ళే మార్గం మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తదితర పనులను పరిశీలించడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీలోని పెండింగ్ పనులను నాణ్యతతో కూడిన విధంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పెద్దవాగుపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పనులను పరిశీలించి,అంబేద్కర్ చౌక్ నుండి ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్-వెజ్ మార్కెట్‌కి నేరుగా వెళ్లే రహదారిని మూసివేసి ట్రాఫిక్ కోసం డివైడర్ ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు. ప్రజలకు రాకపోకలో ఇబ్బందులు కలగకుండా వీలైనంత త్వరగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్-వెజ్ మార్కెట్ పనుల పురోగతిని సమీక్షించి, పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు.మార్కెట్‌కి అనుబంధంగా ఉండే ప్రవేశ రహదారి పనులను త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు.

అదేవిదంగా అంబేద్కర్ చౌక్ నుండి SC కాలనీ కి వెళ్ళే సీసీ రొడ్డు యంకన్న కట్ట నుండి జగజీవన్ రామ్ విగ్రహం వరకు గుంతల మయంగా ఉన్న రోడ్డును పరిశీలించడం జరిగింది

ఈ సందర్భంగా కలెక్టర్ పట్టణం లో జరిగిన అభివృద్ధి పనుల ను చూసి హర్షం వ్యక్తం చేశారు. అలాగే వెజ్ నాన్ వెజ్ మార్కెట్ వేలం ఎందుకు లేట్ అయ్యిందో అడిగి ఆరా తిశారు.

తదనంతరం మున్సిపల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ని మున్సిపల్ చైర్మన్ దేవన్న శాలువా కప్పి గజమాల తో సత్కరించారు

కార్యక్రమం లో మున్సిపల్ కమిషనర్ శ్రీ రాజయ్య , ఇంజనీర్ రాజశేఖర్ , మేనేజర్ అశోక్ కుమార్ రెడ్డి , ఆర్ అండ్ బి అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, బీఆర్ఎస్ నాయకులు గజ్జి దేవరాజు , ముఖ్య అధికార యంత్రాంగం మొత్తం పాల్గొన్నారు


SAKSHITHA NEWS