సీసీ రోడ్ పనులను పరిశీలించిన డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యలు
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 20వ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ లో కేకేఎం ఫేస్-1 నుంచి ఫేస్-5 వరకు రూ:1కోటి 20లక్షల రూపాయలతో జరుగుతున్న సీసీ రోడ్ పనులను డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , కార్పొరేటర్లు బాలాజీ నాయక్, కాసాని సుధాకర్, గాజుల సుజాత, కో ఆప్షన్ సభ్యలు చంద్రగిరి జ్యోతి సతీష్, మునిసిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్బంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ నాణ్యతలో రాజీ లేదని,సీసీ రోడ్లు నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని కాంట్రాక్టర్ & అధికారులను ఆదేశించారు, అవకతవకలు జరిగితే సహించేది లేదని స్పష్టంగా కాంట్రాక్టర్కు చెప్పారు. ఈ కార్యక్రమం నాయకులు, మునిసిపల్ అధికారులు డీఈ వసంత, దాసయ్య, ఏఈ ప్రవీణ్, ఇంజినర్ శివ, ఫీల్డ్ అసిస్టెంట్ ప్రసాద్, సత్యం వ్యాలీ, సత్యం హైట్స్ , జయ దీపిక అపార్ట్మెంట్ & స్థానిక కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు…