కమిటీ ఆమోదం మేరకే మఠం భవనం కూల్చివేత
** జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: గాంధీ రోడ్డులో గల హథీరాంజీ మఠం భవనం కూల్చివేతపై కమిటీ నిర్ణయం మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో పురాతనమైన హథీరాంజీ భవనం కూల్చడం పై నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య, ప్రజా ప్రతినిధులు, దుకాణదారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. గాంధీ రోడ్డులో గల హథీరాంజీ మఠం భవనం ప్రత్యక్షంగా పరిశీలించడం జరిగిందని తెలిపారు. పరిశీలన అనంతరం పగుళ్ళు ఏర్పడిన ప్రాంతాలను తప్పనిసరిగా పునర్నిర్మాణం, కూల్చివేత పై మరోసారి కమిటీ నిర్ణయం మేరకు తగు పునరాలోచన తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచిగా నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ బోర్డు చైర్ పర్సన్ సుగుణమ్మ, రాష్ట్ర అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఊకా విజయ కుమార్, డిప్యూటీ మేయర్ ఆర్.సి.మునికృష్ణ, మఠం ఏవో బాపిరెడ్డి, రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్, తదితరులు పాల్గొన్నారు.
