అమెరికా మంత్రిగా తిరుపతి వాసి

Sakshitha news

అమెరికా మంత్రిగా తిరుపతి వాసి

** సత్కరించిన “తుడ” చైర్మన్ డాలర్స్ దివాకర్

సాక్షిత ప్రతినిధి – తిరుపతి: అమెరికాలో తిరుపతి జిల్లా వాసికి కీలక పదవులు లభించాయి.. చంద్రగిరికి చెందిన టిడిపి మహిళా నేత లంకెల్ల లలిత శ్రీరాముల కుమారుడు బద్రి గత కొన్నేళ్లుగా అమెరికాలో ఉంటున్నారు.. తాజాగా జరిగిన విస్కాన్ సిన్ స్టేట్ ఎన్నికల్లో గెలుపొంది నాలుగు శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన తిరుపతికి రావడంతో తుడా చైర్మన్, టీటీడీ బోర్డు సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి ఆయనను కలిసి ఘనంగా సత్కరించారు. తమకు అత్యంత ఆప్తులు బద్రి అమెరికాలో మంత్రిగా పనిచేయడం సంతోషంగా ఉందన్నారు.