మచ్చ చంద్రమౌళి గౌడ్ 56 జయంతి

Sakshitha news

మచ్చ చంద్రమౌళి గౌడ్ 56 జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

ఆలేరు నియోజకవర్గం పరిధిలోని చీకటిమామిడి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ మచ్చ చంద్రమౌళి గౌడ్ 56 జయంతి సందర్భంగా వారి సతీమణి శ్రీమతి మచ్చ శ్రీదేవి తో కలిసి మచ్చ చంద్రమౌళి గౌడ్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఆ నిస్వార్ధ ప్రజా నాయకుడి దివ్య స్మృతికి ఘన నివాళులు అర్పించారు..

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ..

తన నిస్వార్థ జీవితాన్ని ప్రజా సంక్షేమం కోసం అంకితం చేసిన ప్రజా నాయకుడు మచ్చ చంద్రమౌళి గౌడ్ అని గుర్తుచేశారు..

తన రాజకీయ జీవితం ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్, చీకటిమామిడి గ్రామ సర్పంచ్ గా ఎన్నో సేవలు అందించారాని కొనియాడారు..

ఈ కార్యక్రమంలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్ష్మయ్య గౌడ్,మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, బీసీ సంఘం నాయకుడు హరిశంకర్ గౌడ్, అత్వెళ్లి మల్లేశం గౌడ్, బాలప్ప, బండి శ్రీనివాస్ గౌడ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు..