వివాదాస్పదంగా మారిన పాలిటెక్నిక్ వినాయకుడి మండపం
వివాదానికిఎమ్మెల్యే వర్గాలే కారణమా
నిర్వహణ బాధ్యత కమిటీ దేనని పోలీసుల హెచ్చరిక
…..
సాక్షిత వనపర్తి :
వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల ఆర్చు లో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపం వివాదాస్పదంగా మారింది అందుకు కారణం పట్టణకాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే మెగా రెడ్డి వర్గాల మధ్య ఏర్పడిన అధిపత్యాల కారణంగానే ఈ వివాదం ఏర్పడిందని గత నాలుగు రోజుల నుండి ఏర్పాటు చేస్తున్న వినాయకుడి మండపాన్ని పోలీసులు ఎలాంటి అబ్జెక్షన్ చేయలేదని కానీ సోమవారం రాత్రి వచ్చి వినాయకుని ఇక్కడ నిలబెట్టకూడదని పాలిటెక్నిక్ ముందర యూటర్న్ రోడ్డు మార్గాలు ఉన్నందున వాహనాల రద్దీ తో ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతాయని ప్రమాదాలు చోటు చేసుకుంటాయని కాబట్టి ఇక్కడ వినాయకుడిని ఏర్పాటు చేయకూడదని నిర్వాహకులను కోరడంతో వివాదం పోలీస్ స్టేషన్కు చేరుకుంది దీంతో వనపర్తి డిఎస్పి వెంకటేశ్వరరావు రంగ ప్రవేశం చేసి నిర్వాహకులతో చర్చించడం జరిగింది ఈ చర్చలో మండపం పై ఎవరు అబ్జెక్షన్ చేశారో తెలపాలని నిర్వాహకులు కోరగా వారి పేర్లు పోలీసులు తెలపకపోవడం విశేషం వినాయక కమిటీ సభ్యులు రంజాన్ పండుగ సందర్భంగా పాలిటెక్నిక్ కళాశాల ఎదురుగా రోడ్డు పైన తడకలతో హలీం షాపులను ఏర్పాటు చేసి నెల రోజులపాటు నిర్వహిస్తున్న
ఆప్పుడు ఎందుకు అబ్జెక్షన్ చేయలేదని ఆర్చ్ లోపల నాలుగు రోజులు వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం వలన ఎవరికి ఇబ్బంది లేదని కేవలం కొంతమంది నాయకుల అహంతో ఏర్పడిన సమస్య ఇది అని ఇది హిందూ ముస్లింల సమస్య కాదని వినాయక కమిటీలో ముస్లిం యువకులు ఇతర పార్టీలా నాయకులు కూడా భాగస్వాములు అవుతున్నందున వేరే ఏ విధమైన సమస్య లు కారణం కాదని కమిటీ నిర్వాహకులు తెలుపుతున్నారు అయితే పోలీసుల నిబంధన ప్రకారం విగ్రహ ఏర్పాటుకు పర్మిషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం జరిగిందని తెలిపినప్పటికీ కొత్తగా పేపర్ పైన దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంతో దరఖాస్తు చేసుకోవడం జరిగిందిని నిర్వాహకులు తెలిపారు అయితే వినాయకడి పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని ఎలాంటి సమస్యలు ఏర్పడిన అది ఉత్సవ కమిటీ బాధ్యత అని వనపర్తి డిఎస్పి తెలిపినట్లు తెలుస్తోంది అయితే గత రెండు సంవత్సరాలుగా జిల్లా కాంగ్రెస్ ఆది నాయకుల మధ్య అసెంబ్లీ ఎన్నికల సమయంలో వివాదాలు చోటుచేసుకుని వర్గాలుగా విడిపోయారని అది చాలక ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యే సొంత వర్గంలోని విభేదాలు చోటుచేసుకుని వినాయకుడి ఉత్సవాలను వేదికగా చేసుకుని ఇలాంటి సమస్యలు సృష్టించడం పట్ల స్థానిక ప్రజలు ఇతర పార్టీల నాయకులువీరి తీరు పట్ల అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీరు తీరు ఎలాంటి సమస్యలకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే మరి.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
