తెలుగుదేశం పార్టీ నేత కొత్త సాంబశివరావు మరణం చాలా బాధాకరం…పార్టీకి తీరని లోటు.
మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు .
వెలదికొత్తపాలెంలోని వారి స్వగృహంలో సాంబశివరావు సంతాప సభ…విగ్రహావిష్కరణ.
ఎన్టీఆర్ జిల్లా, చందర్లపాడు(వెలదికొత్తపాలెం),
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, చందర్లపాడు మండల పరిషత్తు మాజీ అధ్యక్షులు, నందిగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, కొత్త వెంకట సాంబశివరావు మరణం చాలా బాధాకరమని ఆయన మృతి పార్టీకి తీరనిలోటని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు.
చందర్లపాడు మండలం, వెలదికొత్తపాలెంలోని వారి స్వగృహంలో సాంబశివరావు సంతాప సభ, విగ్రహావిష్కరణ జరిగింది. ఈ సభలో ప్రభుత్వ విప్, నందిగామ శాసనసభ్యురాలు, శ్రీమతి తంగిరాల సౌమ్య , ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు నెట్టెం రఘురాం , మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్త సాంబశివరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ కొత్త సాంబశివరావు సుదీర్ఘ కాలంపాటు గ్రామ పెద్దగా, చందర్లపాడు మండలంలో, నందిగామ నియోజకవర్గ స్థాయిలో నాయకునిగా తెలుగుదేశం పార్టీకి, ప్రజలకు విశేష సేవలు అందించారన్నారు. ముక్కుసూటి మనస్తత్వంతో తను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన సమర్థవంతమైన నాయకులు సాంబశివరావు ని పేర్కొన్నారు. ముక్కుసూటిగా పనిచేసినా నిగర్విగా సేవలను అందించారన్నారు. ముక్కుసూటి వైఖరికి, గర్వానికి ఉన్న తేడాను అందరూ గమనించాలన్నారు. ఆయన సేవలు ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.