వార్డుకు కీడు వచ్చిందని వార్డు ఖాళీ చేయించిన కౌన్సిలర్
నేల రోజుల వ్యవదిలి ఆరుగురు గురు మృతి
అంతా మంగళవారమే చనిపోవడంతో కీడుగా భావించిన ప్రజలు
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: కీడు పేరుతో వార్డు ప్రజలు ఇళ్లకు దూరంగా వెళ్లి వనభోజనాలు చేసిన ఘటన సూర్యపేటలో చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 20వ వార్డులో గత నెల రోజుల వ్యవధిలోనే ఆరుగురు మరణించారు. అది కూడా అందరూ మంగళవారం రోజూ మరణించడంతో 20వ వార్డు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇదే విషయమై కౌన్సిలర్ అన్నేపర్తి రాజేష్ పండితులను వివరణ కోరగా వార్డుకు కీడు వచ్చిందని తెలియజేయడం తో వెంటనే వార్డు పెద్దలతో చర్చించి వారికి పూర్తి వివరాలు తెలియజేసిన వార్డు కౌన్సిలర్ ఒక రోజు వార్డు మొత్తాన్ని ఖాళీ చేసి వెళ్లాలని దానివలన మన వార్డుకు పట్టిన కీడు పోతుంది అని చెప్పడంతో ఆదివారం ఉదయం వార్డు ప్రజలంతా వార్డును ఖాళీ చేసి వెళ్లారు.
గతంలో (2015) ఇలాగే జరిగితే అప్పటి వార్డు కౌన్సిలర్ కుంభం రజిత-నాగరాజు ఆధ్వర్యంలో వార్డు ప్రజలు ఖాళీ చేయడం జరిగిందని మరల ఈ విధంగా జరగడంతో వార్డు సీనియర్ నాయకులు తీర్మానం మేరకు వార్డు ను ఖాళీ చేసినట్టు తెలిపారు. వార్డు ప్రజలు వార్డు ను ఖాళీ చేసి అడవి ప్రాంతాలకు వెళ్లి వనభోజనాలు చేసి సాయంత్రం తిరిగి ఇండ్లకు చేరుకున్నట్లుగా తెలిపారు.