SAKSHITHA NEWS

ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు కొండంత అండగా మారింది- కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పేద ప్రజలకు CMRF ఆర్థిక సహాయం చెక్కులను మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్
అందజేశారు. నిరుపేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతో మేలు జరుగుతుందని, అనారోగ్యంతో కార్పొరేట్ లో వైద్యం చేపించుకున్న ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలని శ్రీశైలం గౌడ్ తెలిపారు.

ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన అలీం ఉద్దీన్ అన్సారీ రూ. 60,000/- తలారి సంపంత్ రూ. 60,000/- డి. లక్ష్మి రూ. 12,500/- టీ. కమల రూ. 20,500/- రూ 60,000/- సంబశివా రావు రూ.55,000/- లకు చెక్కులను శ్రీశైలం గౌడ్ అందించారు.

ఈ కార్యక్రమంలో దుర్గారావు, చాంద్ భాషా, మల్లం శ్రీను, గుబ్బల రమణ, నరేందర్, రజాక్, చోటు, తోకల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..


SAKSHITHA NEWS