SAKSHITHA NEWS

కేటీఆర్ పై కేసు అక్రమం

  • రాజకీయ కక్ష సాధింపులో భాగమే ఈ దుశ్చర్యలు
  • రేవంత్ సర్కారు ఆగడాలను అడ్డుకుంటాం
  • భారాస జిల్లా అధ్యక్షులు
    మాజీ ఎంపీ
    మాలోత్ కవిత

హైదరాబాద్,

  • ఫార్ములా – ఈ కార్ రేసింగ్‌ లో అవకతవకలకు పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ప్రభుత్వం పెట్టిన కేసు అక్రమమని బీఆర్ఎస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎంపీ మాలోత్ కవిత మండిపడ్డారు.
  • కేటీఆర్ పై నమోదు చేసిన కేసు రాజకీయ కక్ష లో భాగమేనని విమర్శించారు. ఈ రకమైన కాంగ్రెస్ దుశ్చర్యలు బీఆర్ఎస్ నేతల నైతిక స్తయిర్యాన్ని దెబ్బతీయలేవని పేర్కొన్నారు.
  • కేటీఆర్ అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వణుకు పుడుతోందని, ప్రజాసమస్యలపై ఆయన సాగిస్తున్న పోరాటాలకు భయపడి కేసులతో వేధిస్తోందని ధ్వజమెత్తారు. కేటీఆర్ పై తప్పుడు కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
  • బీఆర్ఎస్ నేతలు ఏదైనా ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం దబాయింపు ధోరణితో విచారణల పేరిట అక్రమ కేసులు పెడుతుంద‌ని ఆరోపించారు.
  • రాష్ట్రం కోసం, రాష్ట్ర‌ ఇమేజ్ పెంచడం కోసం కేటీఆర్ పని చేస్తే ఇవాళ కేటీఆర్ మీద అన్యాయంగా కేసు పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాక్షసానందం పొందుతోందని ఎద్దేవా చేశారు.
  • ఫార్ములా – ఈ కార్ రేసింగ్‌పై అసెంబ్లీలో చ‌ర్చ‌కు పెడితే స‌మాధానం చెప్పేందుకు రెడీగా ఉన్న‌ట్లు కేటీఆర్ స్ప‌ష్టం చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సీఎం నిరంకుశత్వానికి నిదర్శనమని అన్నారు.
  • అక్రమ కేసులతో బీఆర్ఎస్ ను దెబ్బతీయలేరని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ దుర్మార్గ విధానాలకు, ఆగడాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు పోరాడుతాయని హెచ్చరించారు.
  • ప్రజాస్వామ్యవాదులంతా కేటీఆర్ పై అక్రమ కేసులు పెట్టడాన్ని ఖండించాలని మాలోత్ కవిత పిలుపునిచ్చారు.

Kavitha Maloth
BRS Party


SAKSHITHA NEWS