SAKSHITHA NEWS

కె టి ఆర్ పై కేసు రాజకీయ కుట్ర: ఆందోల్ మాజీ ఎం ఎల్ ఏ క్రాంతి కిరణ్

ఈ ఫార్ములా రేస్ విషయంలో ఉద్దేశపూర్వకంగానే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె టి ఆర్ పై కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ వివిద రూపాలుగా ప్రభుత్వం పై ఒత్తిడి చేస్తున్నందుకు కక్ష్య సాధింపుకు పాల్పడు తుంది ప్రభుత్వం. ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియపరుస్తున్నారు. అవినీతితో కూడిన ప్రభుత్వ విధానాలను బట్టబయలు చేస్తున్నారు. దీన్ని సహించలేకపోతున్న రేవంత్ ప్రభుత్వం కె టి ఆర్ పై కక్ష్య కట్టి కేసు నమోదు చేసింది. ప్రజాస్వామ్యం లో ప్రతిపక్షం నిర్వహించాల్సిన బాధ్యతను కె టి ఆర్ నెరవేర్చుతుంటే నిరంకుశ విధానాలతో గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .

కోటి ఆశలతో ఏర్పడ్డ తెలంగాణ కె సి ఆర్ నాయకత్వంలో పదేళ్ళు ప్రశాంత వాతావరణంలో లో గణనీయమైన అభివృద్ధి ని సాధించింది. కె సి ఆర్ నాయకత్వంలో దేశంలోనే ధనిక రాష్ట్రంగా అవతరించింది. కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇమేజ్ ను దెబ్బతీసే కుట్ర చేస్తున్నది. ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజలను ఇక్కట్లపాలు చేస్తున్నారు. తెలంగాణ అంటేనే నిరంకుశపాలన అనే విధంగా ఉంది ప్రస్తుత పరిస్థితి. ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ కె టి ఆర్ పై పెట్టిన కేసును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్న. రాజకీయ కక్ష సాధింపులు, డైవర్షన్ మాటలు మానుకుని పాలనపై దృష్టి పెట్టాలని కోరుతున్న.

క్రాంతి కిరణ్
మాజీ ఎం ఎల్ ఏ


SAKSHITHA NEWS