SAKSHITHA NEWS

The business of private educational institutions should be stopped.

ప్రైవేటు విద్యా సంస్థల వ్యాపారాన్ని అరికట్టాలి……
…* టీజేఎస్ జిల్లా అధ్యక్షు లు య౦ఏ ఖాదర్ పాష.. …..
నిబంధన లు పాటించని విద్యాసంస్థలను సీజ్ చేయకపోతే విద్యా కార్యాలయాల ముట్టడిస్తా మనీ హెచ్చరిక

  • సాక్షిత వనపర్తి జూన్ 6 తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థలు విద్యను వ్యాపారం చేస్తూ ఫీజుల పేరుతో లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారని* *తెలంగాణ జన సమితి పార్టీ వనపర్తి జిల్లా అధ్యక్షులు ఖాదర్ పాష ఒక ప్రకటనలో ఆరోపించారు *…తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థలు చేస్తున్న ఫీజుల దోపిడిని అరికట్టే విధంగా చర్యలు తీసుకొని ఫీజుల నియంత్రణ చట్టం మమలు చేయాలని తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు ఖాదర్ పాష ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీల్లో విద్యార్థులకు ఇచ్చిన హామీలను విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే అమలు చేస్తామని అన్నారు . వనపర్తి జిల్లా కేంద్రంలో ఉన్న ప్రైవేటు విద్యాసంస్థలను ఆయా మండలాల శాఖల అధికారులు తనిఖీలు చేసి ప్రభుత్వ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని పర్మిషన్ లేకుండా నడుస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలను గుర్తించి సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. కొన్ని పాఠశాలలు గత సంవత్సరం రిజల్ట్ ప్రకారంగా ఓచర్లు బోర్డు పెట్టుకొని చలామణి అవుతున్న ప్రైవేటు విద్యా సంస్థల పైన ప్రభుత్వం .నిబంధనలు పాటించని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేయాలని ప్రైవేటు విద్యా సంస్థల చేస్తున్న ఫీజుల దోపిడిని అరికట్టే విధంగా ఫీజుల నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు రాష్ట్రంలో ప్రభుత్వ విద్యరంగం బలోపేతానికి ప్రభుత్వం పాఠశాలలు కళాశాలలు సంక్షేమ హాస్టల్ యూనివర్సిటీలో మౌలిక వసతులు కల్పించి ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ చేసి ప్రభుత్వ విద్యాలయాల్లో విద్య ప్రమాణాలు పెరిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విద్యార్థులకు యువకులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని విద్యార్థులకు ఇస్తామన్న ఎలక్ట్రిక్ స్కూటీలు లాప్టాప్ లు మండలాల నీకో ఇంటర్నేషనల్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని అన్నారు విద్యార్థులకు ప్రభుత్వం విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావాలని ఫీజుల పేరిట ప్రైవేటు విద్యాసంస్థలు చేస్తున్న ఫీజుల దోపిడీని అరికట్టాలని ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు ఫీజులను నియంత్రించాలని వారిపై కఠిన చట్టాలు అమలు చేసి నిబంధనలు పాటించని విద్యాసంస్థలను జిల్లా అధికారులు కలెక్టర్ డీఈఓ తక్షణమే స్పందించి సీజ్ చేయాలని అన్నారు. లేని పక్షంలో తెలంగాణ జన సమితి పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలో మండలాల్లో విద్యాశాఖ అధికారుల కార్యాలయాలను ముట్టడిస్తామని ఖాదర్బాషా హెచ్చరించారు. ..
WhatsApp Image 2024 06 06 at 17.58.55

SAKSHITHA NEWS