గణపవరం గ్రామ యువకుడు గణేష్ దారుణ హత్య నిందితులను కాపాడుతున్నార.. * *గణేష్ తల్లిదండ్రులు గ్రామ పెద్దలు.
సాక్షిత:
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరం గ్రామానికి చెందిన బల్గూరి గణేష్ (24) అనే దళిత యువకుడు, 15 మే 2026 నాడు అమానుషంగా అతి క్రూరంగా హత్య చేయబడిన ఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తోంది.గణేష్‌ను బట్టలు విప్పించి, తన బట్టలతోనే కాళ్ళు చేతులు కట్టేసి ఇష్టానుసారంగా కొట్టి చిత్రహింసలు చేసి గొంతు కోసి చంపడం సాధారణ హత్య కాదు ఇది ఒక క్రూరమైన, పాశవికమైన, మానవత్వాన్ని మరిచిన నేరం.కానీ ఈ కేసులో నిందితులను పట్టుకోవాల్సిన పోలీసులు, నిజాలను దాచిపెట్టి, కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానం ప్రజల్లో బలంగా వ్యక్తమవుతోంది.
పోలీసులపై తీవ్రమైన ఆరోపణలు ఎవరి ఒత్తిడికి పని చేస్తున్నారు?
ఈ కేసులో పోలీసుల వ్యవహారం పూర్తిగా అనుమానాస్పదంగా ఉంది
ఘటన స్థలంలో క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను సమర్థంగా వినియోగించలేదు ఇది సాధారణ నిర్లక్ష్యం కాదు, ఉద్దేశపూర్వక వైఫల్యం.
సేకరించిన వేలిముద్రలు, ఫోరెన్సిక్ ఆధారాలు ఏమయ్యాయి ఎందుకు బయటపెట్టడం లేదు?
పోస్ట్‌మార్టం రిపోర్ట్ రాకముందే కథలు చెప్పడం ఇది దర్యాప్తా లేక కప్పిపుచ్చడమా
డిఎస్పి ప్రెస్ మీట్‌లో చేసిన వ్యాఖ్యలు నిజాలను మాయచేసే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి.
A2 చెప్పిన అంశాల్లోని కీలక ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా మౌనం వహించడం ఎందుకు
డాగ్ స్క్వాడ్ చూపిన దారిని పక్కనపెట్టి వేరే దారిలో దర్యాప్తు మళ్లించడం వెనుక అసలు కారణం ఏమిటి
మొదటి రోజు నుంచే కేసును ఒకే కోణంలోకి నెట్టడం ఇది దర్యాప్తు కాదు, మళ్లింపు ప్రయత్నం.గణేష్ వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా ప్రేమ వ్యవహారం కోణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం అనుమానాస్పదం. మరణించిన వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తున్నాము.
దళితుడి ప్రాణానికి విలువ లేదా SC/ST చట్టం ఎందుకు పెట్టడం లేదు బాధితుడు దళిత యువకుడు అయినప్పటికీ, ఈ కేసులోSC/ST (Prevention of Atrocities) Act, 1989 అమలు చేయకపోవడం దళితులపై జరుగుతున్న వ్యవస్థాత్మక అన్యాయానికి స్పష్టమైన ఉదాహరణ.
దళితుడి ప్రాణం చవకా
లేదా నిందితులు ప్రభావశీలులాఈ ప్రశ్నలకు ప్రభుత్వం మరియు పోలీసు వ్యవస్థ సమాధానం చెప్పాలి.
మా డిమాండ్లు వెంటనే అమలు చేయాలి
ఈ కేసును వెంటనే SC/ST అట్రాసిటీ చట్టం కింద నమోదు చేయాలి.స్థానిక పోలీసులపై నమ్మకం లేకపోవడంతో, కేసును SIT లేదా ఉన్నతస్థాయి సంస్థకు అప్పగించాలి.అన్ని ఫోరెన్సిక్, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ఆధారాలను ప్రజల ముందుంచాలి.కేసును తప్పుదారి పట్టించేలా మాట్లాడిన డిఎస్పీ పై వెంటనే చర్యలు తీసుకోవాలి.
నిందితులను వెంటనే అరెస్ట్ చేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపి కఠిన శిక్షలు విధించాలి. బాధిత కుటుంబానికి పూర్తి భద్రత మరియు న్యాయం జరిగే వరకు ప్రభుత్వ రక్షణ కల్పించాలి గణేష్ హత్య కేసులో నిజాలు బయటకు రాకపోతే,ఈ పోరాటం గణపవరం గ్రామానికే పరిమితం కాదు జిల్లా నుండి రాష్ట్ర స్థాయికి వ్యాపించే భారీ ప్రజా ఉద్యమంగా మారుతుంది.దళితులపై అన్యాయం జరిగితే మౌనం ఉండబోము.న్యాయం కోసం రోడ్లపైకి దిగుతాం ప్రజాస్వామ్య పోరాటాన్ని ఉధృతం చేస్తాం అని గ్రామ ప్రజలు గళమెత్తుతున్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
